Constable Job : మరణించిన తర్వాత కానిస్టేబుల్ గా ఉద్యోగం తెచ్చుకున్న కొడుకు .. కన్నీటి పర్యంతం అవుతున్న తల్లిదండ్రులు ..!
Constable Job : ఎన్నో ఆశలతో తమ కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. తమ కుటుంబానికి పెద్ద కుమారుడిగా అండగా నిలబడతాడని మురిసిపోయారు. కానీ కాలం అతడి సమయాన్ని ముగించింది. అకస్మాత్తుగా అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దీంతో ఆ కుటుంబీకులు కన్నీటి పర్యంతం అయ్యారు. కొడుకు జ్ఞాపకాలు మరిచిపోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు మరోసారి కొడుకు విజయం తో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. కొడుకు మరణించిన తర్వాత దక్కిన విజయాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకునేలా ఏడ్చారు.
ఖమ్మం టేకులపల్లి పాత తండాకి చెందిన భూక్యా ప్రేమ్ కుమార్, పద్మ దంపతులకు 22 ఏళ్ళ ప్రవీణ్ అనే కొడుకు ఉన్నాడు. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. తమ కొడుకు విషయంలో ఆ తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. ప్రవీణ్ చదువులో మంచి మార్కులను సాధించాడు. ఈ క్రమంలోనే పోలీస్ అయ్యేందుకు నిర్ణయించుకున్నాడు. తన కలలు నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. అయితే అనుకోని విధంగా దేవుడు అతడిని పైకి తీసుకువెళ్లాడు. అయితే అతడు మరణించిన తర్వాత అతడికి పోలీసు ఉద్యోగం వచ్చింది.
ఆగస్టు 17న ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ కడుతున్న సందర్భంలో విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడు. అయితే తాజాగా ప్రకటించిన పోలీసు ఫలితాల్లో ప్రవీణ్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు .దీంతో కుటుంబం ఒక్కసారిగా విలవిలలాడిపోయింది. తన కొడుకు పోలీస్ అయ్యేందుకు ఎంత కష్టపడ్డాడో తెలుసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ కుటుంబానికి అండగా నిలబడాల్సిన కొడుకు ని కాలం చిమ్మేసింది అని, తమ కొడుకు బ్రతికి ఉంటే కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చినందుకు ఎంత సంతోషపడేవాడో అంటూ తలుచుకొని బాధపడుతున్నారు.