అకీరా, ఆద్యలను మెగా ఫ్యామిలీలో కలిపేసిన నాగబాబు.. మరి రేణూ దేశాయ్ సంగతేంటి?
ప్రస్తుతం ఎక్కడ చూసిన నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలో లేదంటే ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కలిసి ఉన్న ఫోటోలు, బన్నీ-పవన్ కళ్యాణ్ ఫోటోలు, అకీరా నందన్, ఆద్య, వైష్ణవ్ తేజ్ ఇలా కొందరి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్రేమ్‌లో ఎంతో మంది ఉన్నా కూడా కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పడుతోంది. అందులో భాగంగా నాగబాబు తాజాగా ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో చిరంజీవి, నాగబాబు జంటగా […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలో లేదంటే ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కలిసి ఉన్న ఫోటోలు, బన్నీ-పవన్ కళ్యాణ్ ఫోటోలు, అకీరా నందన్, ఆద్య, వైష్ణవ్ తేజ్ ఇలా కొందరి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్రేమ్‌లో ఎంతో మంది ఉన్నా కూడా కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పడుతోంది. అందులో భాగంగా నాగబాబు తాజాగా ఓ ఫోటోను షేర్ చేశాడు.
అందులో చిరంజీవి, నాగబాబు జంటగా ఉన్నారు. కొత్త జంటతో కలిసి దిగిన ఈ ఫోటోలు అకీరా నందన్, ఆద్యలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ ఫోటోకు నాగబాబు పెట్టిన క్యాప్షన్ మాత్రం కాస్త ఆలోచించాల్సిన విధంగానేఉంది. కొణిదెల కుటుంబం సపరివార సమేతంగా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అకీరా, ఆద్యలను నాగబాబు కొణిదెల ఫ్యామిలీలోనే కలిపేశాడు.
మరి రేణూ దేశాయ్ మాత్రం కొణిదెల ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది. అంటే భవిష్యత్తులో వారు కొణిదెల వారసులిగానే పరిగణింపబడతారు. మామూలుగా అయితే అందరూ ఈ వేడుకల్లో రేణూ దేశాయ్ కూడా వస్తుందని అనుకున్నారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం తన వెబ్ సిరీస్ షూటింగ్‌లొ బిజీగా ఉంది. మొత్తానికి పిల్లలు మాత్రం కొణిదెల కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు. ఇక రేణూదేశాయ్ మాత్రం ఎప్పటిలానే దూరంగా ఉంటుందేమో.