BJP సర్వే : ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ రిపోర్ట్ ఎలా ఉంది అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BJP సర్వే : ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ రిపోర్ట్ ఎలా ఉంది అంటే..?

BJP : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి మరియు ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ మొత్తం అయిదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ మంది దృష్టిని ఆకర్షిస్తున్నవి మాత్రం పశ్చిమ బెంగాల్‌ మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఏడాది కాలంగానే అక్కడ పావులు కదుపుతూ మమత బెనర్జీని ఇబ్బందికి […]

 Authored By himanshi | The Telugu News | Updated on :3 March 2021,3:10 pm

BJP : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి మరియు ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఈ మొత్తం అయిదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ మంది దృష్టిని ఆకర్షిస్తున్నవి మాత్రం పశ్చిమ బెంగాల్‌ మరియు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఏడాది కాలంగానే అక్కడ పావులు కదుపుతూ మమత బెనర్జీని ఇబ్బందికి గురి చేసేలా మోడీ మరియు అమిత్‌ షా లు వ్యవహరిస్తూ వచ్చారు. ఆమద్య మమత బెనర్జీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే ను ప్రముఖ సంస్థలు అయిన సీ ఓటర్ మరియు ఏబీపీలు నిర్వహించాయి.

abp and c voter opinion poll give big shock to bjp

abp and c voter opinion poll give big shock to bjp

BJP : బెంగాల్ లో మమత కంటిన్యూ…

పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ ప్రభావం కాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో మాత్రం బీజేపీ అక్కడ లేదు అంటూ సర్వే తేల్చి చెప్పింది. అక్కడ మమతను గద్దె దించాలని బీజేపీ వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు అంటున్నారు. మరో సారి కూడా మమత బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా సర్వే ఫలితం బలంగా చెబుతుంది. ఈ సమయంలో బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. గంగూలీని దించి చివరి నిమిషంలో వ్యూహాలు మార్చితే ఫలితాలు తారు మారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాట డీఎంకే ఖాయం…

తమిళనాడులో ఇప్పటికే వరకు బీజేపీకి గౌరవ ప్రథమైన సీట్లు వచ్చిన సందర్బం లేదు. అలాంటి తమిళ నాట అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని ఉవ్విల్లూరుతోంది. తమిళనాట ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మోడీ పావులు కదిపి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కాని అక్కడ కూడా బీజేపీ పాచిక పారడం లేదు అంటూ సర్వే ఫలితం వచ్చింది. డీఎంకే కూటమి అక్కడ ప్రభుత్వంను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సంస్థ క్లారిటీగా ప్రకటించింది. ఇక బీజేపీ అక్కడ మళ్లీ సింగిల్ డిజిట్ స్థానాలు అయినా సంపాదిస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట కమల్‌ పార్టీ ప్రభావం ఎంత అంటే చాలా తక్కువ అంటూ సర్వే ఫలితం చెబుతోంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది