Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో వాస్తు నిపుణులు కొన్ని మొక్కలను ఇంటి ముందు పెంచకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, బొప్పాయి చెట్టును ఇంటి ముందు నాటడం శుభకరం కాదంటున్నారు.
బొప్పాయి పండు, ఆకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవైనా, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంటి ముందు భాగంలో ఉంచడం అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఈ చెట్టు ఇంటి ముందు ఉంటే..

#image_title
ఇంటిలో ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది
మనశ్శాంతి లోపించేందుకు అవకాశం ఉంటుంది
కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది
ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ఈ చెట్టును చూడటం కూడా అరిష్టంగా భావించబడుతుంది
అందువల్ల ఇంటి ముందు భాగంలో ఈ చెట్టును పెంచడం మంచిదేమీ కాదని నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు నిపుణుల సలహా ప్రకారం, బొప్పాయి చెట్టును పెంచాలనుకుంటే, ఇంటి వెనక వైపు నాటడం శుభదాయకమని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో బొప్పాయి విత్తనాలు తాలూకు మొక్కలు ఇంటి ముందు తానుగా పెరగవచ్చు. అటువంటి సందర్భాల్లో అవి చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే తీయించి వెనక భాగంలో నాటితే మంచిదని సూచిస్తున్నారు.