Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ అప్పుడేనా? ప్రభుత్వం ఆలోచన ఏంటి? కేసుల వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటి?
Lockdown in Telangana : దేశవ్యాప్తంగా రోజూ ప్రస్తుతం లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న 2 లక్షల కేసులు దాటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి.కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అలాగే.. డెత్ కేసులు చాలా వరకు తగ్గాయి. మరణాల సంఖ్య తగ్గడం.. రికవరీ రేటు పెరగడంతో.. కరోనా వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చు.అలాగే..
చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా సోకుతుంది. దీంతో అటువంటి వాళ్లు హోం ఐసోలేషన్ లో ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చు.ఏది ఏమైనా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ముందు నైట్ కర్ఫ్యూను ప్రారంభించి కరోనాను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
ఆ తర్వాత కర్ఫ్యూ గడువును పెంచే అవకాశం కూడా ఉంది. అయితే.. కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తేనే కేసులు తగ్గుతాయని.. లేదంటే రాష్ట్రంలో కేసులు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని నిన్న ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఒకవేళ కేసులు పెరుగుతూ వెళ్తే లాక్ డౌన్ పై ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.