YCP : అగ్నిపథ్ స్కీమ్ వివాదం.. వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : అగ్నిపథ్ స్కీమ్ వివాదం.. వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్

 Authored By prabhas | The Telugu News | Updated on :19 June 2022,6:00 am

YCP : అగ్నిపథ్ స్కీమ్ వివాదానికి సంబంధించి గలాటా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోంది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ – బీజేపీ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విధ్వంసాల్ని ఖండించారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడం పట్ల జనసేనాని సంతాపం వ్యక్తం చేశారు. దాడికి స్కెచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.

ఓ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఈ తతంగానికి స్కెచ్ వేసినట్లుగా అనుమానిస్తూ అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకపోవడం గమనార్హం. అది కొంత ఏపీ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయమే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంతకీ, ఈ వివాదం కారణంగా మారే రాజకీయ సమీకరణాలు ఎలా వుండబోతున్నాయి.? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీయడమైతే సహజమే. పైగా, వరుసగా రెండుసార్లు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వుంటుంది.

Agneepath A Big Advantage For YCP

Agneepath, A Big Advantage For YCP

పెట్రోధరల మంట సహా అనేక అంశాల్లో మోడీ సర్కారు వైఫల్యాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. సో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ‘ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..’ అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఓ రకంగా వైసీపీకి అడ్వాంటేజ్. బీజేపీకి జాతీయ స్థాయిలో మెజార్టీ తగ్గితే, ఏపీ నుంచి ఎంపీల బలం అవసరమవుతుంది. అప్పుడు ఏపీ నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ గట్టిగా వినిపించేందుకు వైసీపీకి అవకాశం దొరుకుతుంది. సో, ఎలా చూసినా రానున్న రోజులు వైసీపీకి మరింత సానుకూలమేనని చెప్పక తప్పదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది