Ajith | ఆ సమస్యతో బాధపడుతున్న అజిత్.. స్వయంగా వెల్లడించ‌డంతో .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ajith | ఆ సమస్యతో బాధపడుతున్న అజిత్.. స్వయంగా వెల్లడించ‌డంతో ..

 Authored By sandeep | The Telugu News | Updated on :2 October 2025,6:00 pm

Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగే పేరు తల అజిత్ కుమార్. 63కు పైగా చిత్రాల్లో నటించిన అజిత్‌కు కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో మళ్లీ బాక్సాఫీస్‌ దుమ్మురేపారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్‌ ప్రస్తుతం సినిమాల‌తో పాటు తనకు ఇష్టమైన కార్ రేసింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.

#image_title

పాపం అజిత్..

అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ కొన్ని పర్సనల్ విషయాలు వెల్లడించి తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా, తనకు నిద్రలేమి (Insomnia) సమస్య చాలా కాలంగా ఉందని చెప్పారు. ఎన్ని పనులు చేసినా.. ఎంత ఎదిగిన‌.. నిద్ర నా జీవితంలో పెద్ద సమస్యే. చాలా కాలంగా నేను రోజుకు కేవలం నాలుగు గంటలే నిద్రపోతుంటాను. అంతకు మించిన నిద్ర నాకు సాధ్యం కాదు,” అని అజిత్ అన్నారు.

అతని రేసింగ్, సినిమాల షెడ్యూల్స్ వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నానన్న ఆవేదనను కూడా వ్యక్తం చేశారు.“పిల్లలను రోజూ చూడటం కుద‌ర‌డం లేదు. ఈ మధ్య వారిని కలవడం కూడా అరుదైపోయింది. ఇంటి బాధ్యతలన్నీ నా భార్య షాలిని భుజాన వేసుకుంది. ఆమె లేకపోతే నేను ఇవన్నీ చేయలేను,” అంటూ భార్యపై ప్రేమను వ్య‌క్త‌ప‌రిచారు అజిత్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది