Allu Sirish : నేను కోరుకునేది అదొక్కటే.. అల్లు శిరీష్ మామూలుడో కాదు!

Authored By Tech Desk | The Telugu News | Published on: February 9, 2021, 10:18 am

Allu Sirish : అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై కామెడీ టైమింగ్ ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. హీరోయిన్లను ఆట పట్టిస్తుంటాడు.. తనపై నెటిజన్లు వేసే జోకులను ఆస్వాధిస్తాడు.. సెటైర్లకు కౌంటర్లు ఇస్తుంటాడు. అలా సోషల్ మీడియాలో అల్లు శిరీష్ నిత్యం బిజీగానే ఉంటాడు. షూటింగ్‌లో ఉన్నా కూడా కాసింత గ్యాప్ దొరికితే ఏదో ఒక పోస్ట్ పెడుతుంటాడు.

Allu Sirish about his food habits

Allu Sirish about his food habits

అల్లు శిరీష్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏబీసీడీ సినిమా ఫ్లాప్ అయినా తరుణంతో కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకున్నాడు అల్లు శిరీష్. దానికి తోడు లాక్డౌన్ కూడా రావడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. మొత్తానికి అల్లు శిరీష్ తన కొత్త ప్రాజెక్ట్‌ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో అల్లు శిరీష్‌కు తోడుగా అను ఇమాన్యుయేల్ నటిస్తోన్నట్టుంది. అయితే నిన్న నిర్విరామంగా రాత్రంతా షూటింగ్ చేశారట. డిన్నర్ కూడా చేయకుండా షూటింగ్ కానిచ్చేశారట.

అయితే నేరుగా ఉదయాన్నే టిఫిన్ చేశానని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అది కూడా తనకెంతో ఇష్టమైన దోశ తిన్నానంటూ చెప్పుకొచ్చాడు. దాదాపుగా మూడు నెలల తరువాత దోశ తిన్నాను.. అవును మూడు నెలల తరువాత తిన్నాను అంటూ ఆనందభాష్పాలను కార్చాడు. ఇక నా మిగిలిన జీవితం మొత్తంలో ఒకే ఐటం తినాలని కోరుకోమ్మంటే.. నేను దోశను కోరుకుంటాను అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. తనకు దోశ అంటే అంత ప్రాణమని చెప్పకనే చెప్పేశాడు.

Tech Desk

No bio available for this author.

  1. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  2. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  3. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  4. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  5. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  6. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  7. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp