Manchu Lakshmi : మెగా ఇంట్లో మంచు లక్ష్మి .. అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో వైరల్ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Manchu Lakshmi : మెగా ఇంట్లో మంచు లక్ష్మి .. అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో వైరల్ ..!

Manchu Lakshmi : మెగా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. మొన్న దీపావళికి మెగా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఇక మంచు లక్ష్మి అయితే మెగా వేడుకలో బాగా సందడి చేసినట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 November 2023,5:20 pm

ప్రధానాంశాలు:

  •  Manchu Lakshmi : మెగా ఇంట్లో మంచు లక్ష్మి ..

  •   అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో వైరల్ ..!

Manchu Lakshmi : మెగా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. మొన్న దీపావళికి మెగా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఇక మంచు లక్ష్మి అయితే మెగా వేడుకలో బాగా సందడి చేసినట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇలా ఈవెంట్లో సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి కూడా నెట్టింటా వైరల్ గా మారుతుంటాయి. అంతేకాకుండా మంచు లక్ష్మి ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా తన లైఫ్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకారా కు ఇది మొదటి పండుగ కావడంతో పెద్ద ఎత్తున దీపావళిని జరిపినట్లుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ సతీసమేతంగా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అఖిల్ చైతు ఇలా అందరూ వచ్చారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్, మంచు లక్ష్మి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి ఈవెంట్లో అందరితోనూ సెల్ఫీలు దిగినట్లుగా ఉంది. చిరంజీవి, వెంకటేష్ లతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలన్నీ ఒక ఎత్తు అయితే అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో ఇంకొక ఎత్తులా ఉంది. మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మంచు లక్ష్మికి, అల్లు శిరీష్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నట్లుగా ఉంది. అందుకే ఇలా ఫోటో దిగినట్లుగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు మంచు లక్ష్మి షేర్ చేయడంతో అవి ఇలా వైరల్గా మారాయి. ఇకపోతే మంచు లక్ష్మి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు. ఆహా కోసం చేసిన స్పెషల్స్ మధ్యలోనే ఆగిపోయింది. ఓటిటిలో ఆమె చేసే స్పెషల్ షోలు అంతగా ఆకట్టుకోలేనట్లుగా ఉన్నాయి అనిపిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది