Almond Chicken : నోట్లో వేసుకుంటే కరిగిపోయే బాదం చికెన్.. ఎంతో సింపుల్ గా…
Almond Chicken : నాన్ వెజ్ అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. కాకపోతే ఎప్పుడూ ఒకటే వెరైటీ ట్రై చేస్తూ ఉంటారు. ఈ నాన్ వెజ్ తో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు.. అటువంటి వెరైటీస్ ఓన్లీ హోటల్లోనే తింటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే హోటల్ స్టైల్ బాదం చికెన్ మనం చేసి చూద్దాం…
కావాల్సిన పదార్థాలు : చికెన్ , బాదం పప్పులు, కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మిరియాలు, యాలకులు, కొంచెం జాజికాయ, పచ్చిమిర్చి పోపు కాశ్మీరీ కారం, పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి, ఆయిల్ ,నెయ్యి ఉల్లిపాయలు, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, కొత్తిమీర మొదలైనవి… తయారీ విధానం : ముందుగా ఒక 40 బాదం లు, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, కొంచెం జాజికాయ, వేసి వేయించుకొని తర్వాత దానిని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్టులా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు దాన్లో కాశ్మీరీ కారం, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి చికెన్ దానిలో వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని దాన్లో నాలుగు స్పూన్ల ఆయిల్, రెండు స్పూన్ల నెయ్యి ,వేసి ఒక కప్పు ఉల్లిపాయలు, వేసి ఎర్రగా వేగిన తర్వాత దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మూత తీసి ముందుగా చేసి పెట్టుకున్న బాదం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక పావు లీటర్ నీళ్లను పోసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనిచ్చి తర్వాత దాంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కొంచెం కొత్తిమీర వేసి దింపుకోవడమే అంతే ఎంతో సింపుల్గా వెరైటీగా బాదం చికెన్ రెడీ.