Mana Shankara Vara Prasad Garu Movie Public Talk : మన శంకర వరప్రసాద్ గారు పబ్లిక్ టాక్ .. వింటేజ్ చిరుతో ఫ్యామిలీ పండగ..!
ప్రధానాంశాలు:
Mana Shankara Vara Prasad Garu Movie Public Talk : మన శంకర వరప్రసాద్ గారు పబ్లిక్ టాక్ .. వింటేజ్ చిరుతో ఫ్యామిలీ పండగ..!
Mana Shankara Vara Prasad Garu Movie Public Talk : టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి Sankranthi మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన Chiranjeevi మన శంకర వరప్రసాద్ గారు నేడు (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ఒకరోజు ముందే జనవరి 11 రాత్రి ప్రీమియర్ షోలు పడటంతో పబ్లిక్ టాక్ Public Talk బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని మొదటి స్పందనలు చెబుతున్నాయి. టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ చిరంజీవి షోగా నడుస్తుందట. చిరు కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని అంటున్నారు. “70 ఏళ్లు దాటినా చిరు ఎనర్జీ తగ్గలేదు… బాస్ ఈజ్ బ్యాక్” అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హుక్ స్టెప్ సాంగ్, ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ మెగాస్టార్ పాత రోజులను గుర్తు చేశాయన్నది అభిమానుల మాట.
Mana Shankara Vara Prasad Garu Movie Public Talk : మన శంకర వరప్రసాద్ గారు పబ్లిక్ టాక్ .. వింటేజ్ చిరుతో ఫ్యామిలీ పండగ..!
Mana Shankara Vara Prasad Garu Movie Public Talk : ఆడియన్స్ రియాక్షన్ ఏంటి..
చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటనకు కూడా మంచి స్పందన వస్తోంది. ఇది వీరిద్దరి మూడో సినిమా కావడం విశేషం. ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వీరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయిందని టాక్. చిరు – బుల్లిరాజు మధ్య కామెడీ సీన్స్ థియేటర్లలో నవ్వుల జాతరగా మారాయని అంటున్నారు. సెకండాఫ్ ప్రారంభంలో సినిమా కాస్త స్లోగా అనిపిస్తుందన్న టాక్ ఉన్నా, వెంకటేశ్ ఎంట్రీతో కథ పూర్తిగా వేరే ట్రాక్‌లోకి వెళ్తుందని అంటున్నారు. వెంకీ మామ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలమైన సపోర్ట్‌గా నిలిచిందని పబ్లిక్ అభిప్రాయం. ముఖ్యంగా చిరంజీవి – వెంకటేశ్ కలిసి కనిపించే సన్నివేశాలు, సాంగ్, ఫైట్ సీన్స్ మెగా–విక్టరీ అభిమానులకు ఫుల్ ట్రీట్‌గా మారాయట.
డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ మరోసారి వర్కౌట్ అయిందని ఎక్కువ మంది చెబుతున్నారు. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్‌కి అరిటాకులో వేసి వడ్డించినట్టుగా సినిమా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా, కొంచెం సాగదీతగా ఉన్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మ్యూజిక్ పరంగా భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ థియేటర్లలో మంచి జోష్ తీసుకొస్తుందట. మొత్తం మీద కథలో కొత్తదనం ఆశించకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్తే మన శంకర వరప్రసాద్ గారు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ప్రీమియర్ టాక్ స్పష్టం చేస్తోంది. ఇక కలెక్షన్ల పరంగా సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.