Amazon : బాత్రూంలో పెట్టే సీక్రెట్ కెమెరాలు.. Amazon ఎలా అమ్మేస్తుందో చూడండి .. !!
Amazon : అమెజాన్ లో విక్రయిస్తున్న గాడ్జెట్ ల విషయంలో సంస్థ పై వేసిన పలు కేసులపై విచారణ జరుగుతుండగా తాజాగా మరో కొత్త వివాదం చుట్టుకుంది. గదిలో బట్టలు తగిలించే హుక్కుల కెమెరాలు అమెజాన్ విక్రయిస్తుండడం బయటపడింది. బాత్రూంలో దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు అని ఆ ప్రోడక్ట్ ఫోటోలలో చెబుతున్నారు. అమెజాన్లో కొన్న ఇలాంటి బట్టల హుక్ కెమెరాను ఉపయోగించి బాత్రూంలో తనను చిత్రీకరించారని అమెరికాలో తాజాగా ఓ మహిళ amazon ను కోర్టుకు లాగారు. […]
ప్రధానాంశాలు:
Amazon : బాత్రూంలో పెట్టే సీక్రెట్ కెమెరాలు.. Amazon ఎలా అమ్మేస్తుందో చూడండి .. !!
Amazon : అమెజాన్ లో విక్రయిస్తున్న గాడ్జెట్ ల విషయంలో సంస్థ పై వేసిన పలు కేసులపై విచారణ జరుగుతుండగా తాజాగా మరో కొత్త వివాదం చుట్టుకుంది. గదిలో బట్టలు తగిలించే హుక్కుల కెమెరాలు అమెజాన్ విక్రయిస్తుండడం బయటపడింది. బాత్రూంలో దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు అని ఆ ప్రోడక్ట్ ఫోటోలలో చెబుతున్నారు. అమెజాన్లో కొన్న ఇలాంటి బట్టల హుక్ కెమెరాను ఉపయోగించి బాత్రూంలో తనను చిత్రీకరించారని అమెరికాలో తాజాగా ఓ మహిళ amazon ను కోర్టుకు లాగారు. దీంతో ఈ సంస్థ ఈ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టాలను అతిక్రమిస్తూ ఇలాంటి డివైస్లను దుర్వినియోగం చేస్తున్నారని ప్రైవసీ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించేందుకు అమెజాన్ నిరాకరించింది.
విదేశాల్లో చదువుకుంటూ నటి కావాలని కోరుకున్న ఓ విద్యార్థిని అమెజాన్ కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలకు దిగారు. వేస్ట్ వర్జీనియాలో నివసిస్తున్నప్పుడు బట్టల హుక్ లో ఉన్న కెమెరాతో తనని బాత్రూంలో చిత్రీకరించారని ఆరోపించారు. ఆ బట్టల హుక్ ను అమెజాన్లో కొనుగోలు చేశారని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అమెరికాలోని జిల్లా కోర్టులో చేసిన ఫిర్యాదులో ఆ కెమెరా అమెజాన్ లో లిస్ట్ అయినట్లు ఆమె తెలిపారు. బాత్రూంలో టవల్ తగిలించే హుక్ లా పేర్కొంటూ వారి దృష్టిని ఆకర్షించదు అంటూ క్యాప్షన్ తో అమెజాన్ లో ఈ రహస్య కెమెరాను లిస్టు చేశారని ఆమె చెప్పారు.
వ్యక్తుల అంగీకారం లేకుండా ఈ టవల్ హుక్ వారిని రహస్యంగా చిత్రీకరిస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కేసులో అమెజాన్ కేసును కొట్టివేసేలా కోరడంలో విఫలమైంది. అమెజాన్ లో ఇలాంటి కెమెరాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. బాత్రూంలో దీనిని పెట్టుకోవచ్చు అని చూపిస్తూ టవల్ హుక్ కెమెరా అని అమెజాన్ లిస్ట్ చేసింది. దీని వాడకాన్ని కూడా చూపిస్తుంది. ఒక జంట గొడవ పడుతూ ఆ జంట మధ్య ఉన్న మోసాన్ని ఎత్తి చూపింది. హిడెన్ అలారమ్ క్లాక్ ఒక జంట బెడ్రూంలో సన్నివేశంగా ఉన్న దాన్ని ఫోన్లో చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇమేజ్ను అమెజాన్ లిస్టు చేసింది.
యుఎస్బి కెమెరా లాగా ఉంటుంది. ఇంట్లో సన్నిహితంగా ఉన్న జంటల సన్నివేశాలను చూపించారు. స్మోక్ అలారానికి కెమెరాలో దాచడం ద్వారా భార్యాభర్తల అనైతిక సంబంధాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి రివ్యూ లేని షవర్ రేడియో మాదిరి కెమెరా అమెజాన్ లో లిస్ట్ అయింది. ఇన్ని రోజులు అమెజాన్లో ఇవి ఎలా ఉన్నాయి అని కొందరు ప్రశ్నలు తలెత్తుతున్నారు. ఈ కెమెరా ఇంట్లో చిన్న పిల్లలను చూసేందుకు, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఉపయోగించేటివి అయినప్పటికీ చట్టాలను అతిక్రమిస్తూ ఈ కెమెరాలను దుర్వినియోగపరుస్తున్నారు.