Ambani Family : ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్ గా జరిగాయో తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ఇంకా బిజినెస్, క్రీడా ఇలా అన్ని రంగాల వారు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నిన్నటి వరకు కూడా దేశం మొత్తమే కాదు కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ పెళ్లి గురించే మాట్లాడుకోగా.. ఇప్పుడు ఓ వివాదం అనంత్ అంబానీ కుటుంబాన్ని వార్తల్లో నిలిచేలా చేసింది.
ప్రస్తుతం కాలంలో టెక్నలాజి ఒక రేంజ్ లో అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు.. సరికొత్తగా యాప్స్ అన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఈ యాప్స్ ను కొంతమంది చెడుకు వాడుకుంటున్నారు. ఆ చెడ్డ పనుల వల్ల చాలామంది ప్రముఖులు సమాజంలో తలెత్తుకోకుండా అవుతున్నారు. వారికి ప్రమేయం అసలు వారికి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తూ వారి వ్యక్తిగత హోదాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. మొన్నటి వరకు సినీ తారలను ఎక్కువగా ఇందులోకి లాగగా ఇప్పుడు అంబానీ ఫ్యామిలీని లాగి వార్తల్లో నిలిచేలా చేసారు.
ఈమధ్య కొన్ని సోషల్ మీడియా వేదికలలో అనంత్ అంబానీ ఓ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి అది ఫేక్ వీడియో అయినప్పటికీ.. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోను రూపొందించడంతో చూస్తే అది నిజమైన వీడియో లాగానే అనిపించింది. సేమ్ అనంత్ అంబానీ ముఖాన్ని, అతడి గొంతును సృష్టించారు. గేమింగ్ యాప్ ను అతడు ప్రమోట్ చేస్తున్నట్టు వీడియోను సృష్టించి.. సామాన్యుల జేబులను కొల్లగొట్టారు. అనంత్ అంబానీ పేరును ఉపయోగించుకొని.. డబ్బులు దోచుకుంటున్నారు. కేవలం అనంత్ అంబానీ మాత్రమే కాదు.. అతడి తల్లి నీతా అంబానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆదాని గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ లతో కూడా ఇలాంటి వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారితో కూడా గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నట్టు వీడియోలను సృష్టించారు. పోలీసులకు ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో వారు సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి సారించారు.
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్న ఐడీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలు పెడుతున్న వ్యక్తులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరలో గుర్తిస్తామని చెబుతున్నారు. ఈ తరహా మోసాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి గేమింగ్ యాప్ లు మోసపూరితమైనవే అని.. ప్రజలెవరూ అందులో బెట్టింగ్ కాయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.