Anam Venkata Ramana Reddy : నెల్లూరు యాసలో రోజాపై ఆనం వెంకటరమణారెడ్డి వరుస పెట్టి సెటైర్లు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anam Venkata Ramana Reddy : నెల్లూరు యాసలో రోజాపై ఆనం వెంకటరమణారెడ్డి వరుస పెట్టి సెటైర్లు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :14 February 2023,7:00 pm

Anam Venkata Ramana Reddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. రోజా నియోజకవర్గ నేపథ్యంలో ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు యాసలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేయడం జరిగింది. మీ నియోజకవర్గంలో… రోజక్క మీ ఊరు వచ్చేసా. ఊరు మొత్తం తిరిగిన గాని నీ ఫ్లెక్సీ ఎక్కడ కనపడలేదు. మీ తమ్ముడు వచ్చినా గాని నియోజకవర్గంలో నువ్వు కనబడవా అక్క అంటూ రోజాపై తనదైన శైలిలో ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు యాసతో రెచ్చిపోయారు.

Anam Venkata Ramana Reddy satirical video on roja

Anam Venkata Ramana Reddy satirical video on roja

ఇదే సమయంలో మొన్న మీడియా సమావేశం నిర్వహించి లోకేష్ నీ పిత్రే అని రోజా అనటంపై కౌంటర్లు వేశారు. లోకేష్ హ్యాండ్సమ్ బాయ్ అని అభివర్ణించారు. నీ వ్యాపార అనుభవం అంత వయసు మా లోకేష్ బాబుది అని చెప్పుకోచ్చారు. పద్మావతి కాలేజీలో చదువుకుంటున్న సమయంలో రెండో సంవత్సరంలోనే ఎందుకు జంప్ అయ్యావని ప్రశ్నించారు. కానీ లోకేష్ అమెరికాలోనే పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటోకాల్ దర్శనంలో కూడా మంత్రి రోజా డబ్బులు సంపాదిస్తుంది అని వెంకటేశ్వర స్వామి తనకి కలలోకి వచ్చి చెప్పాడని ఆనం వెంకటరమణారెడ్డి తెలియజేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలకు మర్యాద లేకుండా పోయిందని అన్నారు. నగరే నియోజకవర్గంలో ప్రజలే వచ్చే ఎన్నికలలో రోజా ఓడిపోతుందని చెప్పినట్లు స్పష్టం చేశారు.

ఐదు మంది ఎమ్మార్వోలు దగ్గర రోజా డబ్బులు కలెక్షన్ చేసుకుంటుందని ఆరోగ్యంచారు. నియోజకవర్గంలో కొన్నిచోట్ల కొన్ని వందల ఎకరాలు రోజా దోచుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేసిందని.. ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేయడం జరిగింది. బొమ్మలను విదేశాలకు పంపించాలన్న రోజాకి టాక్స్ కట్టే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది అని పేర్కొన్నారు. ఇవన్నీ నగర నియోజకవర్గంలో ప్రజలే చెప్పారని.. ఆనం వెంకటరమణారెడ్డి మంత్రి రోజాపై తనదైన శైలిలో వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.

YouTube video

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది