ఆనందయ్య కరోనా మందు తీసుకున్న కోటయ్య మృతి
కృష్ణపట్నం ఆనందయ్య anandayya medicine కరోనా మందు తీసుకొని కోలుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందాడు. గుంటూరు జిల్లా జీజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య చనిపోయాడు. ఆయన గత పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కోటయ్య ఆనారోగ్య సమస్యల వల్ల చనిపోయాడా… లేదా కరోనా వల్ల చనిపోయాడా అనే విషయం కుటుంబ సభ్యులు.. తమకు తెలియదన్నారు. ఆయన గత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలోనే చనిపోయాడు.
కోటయ్య అసలు ఎలా చనిపోయాడు
అంతకుముందు కోటయ్య.. ఆనందయ్య anandayya medicine కరోనా మందు తీసుకున్నారు. ఆ మందు తీసుకున్నాక నేను కోలుకున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆనందయ్య కరోనా మందును తీసుకుని తాను కోలుకున్నాను అని తెలిపారు. మందు తీసుకోగానే ఆక్సిజన్ లేవల్స్ బాగా పెరిగాయని కోటయ్య చెప్పారు. కోటయ్య చెప్పిన విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సీపీఐ నేత నారాయణ.. బొనిగె ఆనందయ్యకు తాను ఫోన్ చేశాను అని చెప్పారు. కానీ ఆనందయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. ఏపీ ప్రభుత్వ, కార్పోరెట్ సంస్థలు ఒత్తిడితో ఆనందయ్యను ఎక్కడో నిర్భందించారని సీపిఐ నారాయణ అన్నారు. ఆనందయ్య ఆచూకీపై తాను కోర్టులో ఫిటిషన్ వేస్తా అని తెలిపారు. ఇదిలావుంటే, ఈ రోజు హైకోర్టులో ఆనందయ్య మందుపై విచారణ జరగనుంది. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి అనుమతించాలని హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.