Anandayya Medicine : ఆనందయ్య మందుపై గుడ్ న్యూస్.. సీసీఆర్ఏఎస్ టెస్టు రిజల్ట్ లో ఏముందంటే..?
Anandayya Medicine : ప్రస్తుతం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించే చర్చ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశమంతా.. ఆనందయ్య కరోనా మందును పొగుడుతోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనాకు ఆనందయ్య తన ఆయుర్వేద విద్యను ఉపయోగించి కరోనాకు చెక్ పెట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందును ఇప్పటికే వేల మంది తీసుకున్నారు. అందులో చాలామందికి కరోనా తగ్గింది. కరోనా ఉన్నవాళ్లకు కూడా రెండు మూడు రోజుల్లో నెగెటివ్ వచ్చింది. ఆయుర్వేదానికి ఉన్న పవర్ అటువంటిది. ఆనందయ్య కరోనా మందును ప్రజలు యాక్సెప్ట్ చేశారు కానీ.. ఇంకా ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే ఆయుష్ అధికారులు ఆ మందును పరిశీలించి.. దానిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చి చెప్పారు. కానీ.. ఆ మందును ఆయుర్వేద మందుగా గుర్తించలేమని.. కేవలం దాన్ని నాటుమందుగానే గుర్తించాల్సి ఉంటుంది చెప్పారు.
అలాగే.. ఆ మందును ప్రభుత్వం ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) కు పంపించింది. అక్కడి నుంచి రిపోర్ట్ వస్తే కానీ.. ఆ మందు పంపిణీపై ఎటువంటి నిర్ణయం తీసుకునేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆనందయ్య మందు పంపిణీని ఆపేశారు. అయితే.. సీసీఆర్ఏఎస్ నుంచి ఎటువంటి రిపోర్ట్ వస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. సీసీఆర్ఏఎస్ కు విజయవాడకు చెందిన పరిశోధన కేంద్రం పాజిటివ్ రిపోర్ట్ పంపినట్టు తెలుస్తోంది.
Anandayya Medicine : ఆనందయ్య మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని రిపోర్ట్ పంపిన పరిశోధన కేంద్రం
ఆనందయ్య ఆయుర్వేద మందుపై సుమారు 600 మందిపై శాంపిల్స్ ను ప్రయోగించిన పరిశోధన కేంద్రం రీసెర్చర్లు.. ఆ మందును వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చి చెప్పారు. విజయవాడ, తిరుపతి.. తదితర ప్రాంతాల్లో ఈ మందు శాంపిల్స్ సేకరించి.. దానికి సంబంధించిన నివేదికను సీసీఆర్ఏఎస్ కు పంపించారు. ఇక.. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతులు వస్తే చాలు.. గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు.. వెంటనే ప్రభుత్వం ఆ మందు పంపిణీని ప్రారంభించేందుకు ఆనందయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏది ఏమైనా.. ఇంకా అనుమతులు రాకున్నా కూడా ఆనందయ్య.. తన మిత్రులు, ఇతర బంధువుల సహకారంతో.. కరోనా మందు కోసం వనమూలికల సేకరణ పనుల్లో బిజీగా ఉన్నారు.