Sreemukhi : ఆల్‌రౌండర్‌.. సుమ తర్వాత శ్రీముఖి కి మాత్రమే ఆ ఘనత దక్కింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : ఆల్‌రౌండర్‌.. సుమ తర్వాత శ్రీముఖి కి మాత్రమే ఆ ఘనత దక్కింది

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2022,2:20 pm

Sreemukhi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమె స్థాయిలో కాకున్నా యాంకర్ శ్రీముఖి కూడా భారీ ఎత్తున బుల్లి తెర పై పాపులారిటీని సొంతం చేసుకొని ఒక స్టార్ హీరో హీరోయిన్ రేంజికి ఎదిగి అనడంలో సందేహం లేదు. యాంకర్ సుమ కేవలం ఒక్క ఛానల్ అని కాకుండా దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో కూడా కనిపించింది.. కనిపిస్తూనే ఉంది. సుమ ని ఎంటర్‌టైన్మెంట్‌ ఛాన్సల్‌ లోనే కాకుండా న్యూస్ చానల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు అదే తీరున యాంకర్‌ శ్రీముఖి కూడా సుమ తర్వాత అన్ని చానల్స్ లో సందడి చేస్తోంది. యాంకర్ శ్రీముఖి ఒకవైపు ఈ టీవీ లో జాతి రత్నాలు కార్యక్రమాన్ని చేస్తూనే మరో వైపు జీ తెలుగు మరియు స్టార్ మా లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇలా శ్రీముఖి మరియు సుమకి మాత్రమే సాధ్యం అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ సుమ ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో కూడా కార్యక్రమాలను చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

anchor sreemukhi and suma get rare record from tv industry

anchor sreemukhi and suma get rare record from tv industry

ఇప్పుడు అదే దారిలో యాంకర్ శ్రీముఖి కూడా విభిన్నమైన కార్యక్రమాలతో విభిన్నమైన ఛానల్స్ లో కనిపిస్తూ బుల్లి తెరపై తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు బుల్లితెర యాంకర్స్‌ లో ఈ ఘనత కేవలం ఈ ఇద్దరూ యాంకర్ కి మాత్రమే ఇది సాధ్యం అయింది అంటూ బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంత మంది యాంకర్స్ లేదా కమెడియన్స్ కేవలం ఒక్క ఛానల్ కి పరిమితం కావాల్సి ఉంటుంది.. కానీ ఆ విషయంలో శ్రీముఖి మరియు సుమలకు మినహాయింపు లభించినట్లు వారి వారి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది