Roman Latrines : రోమ్ లోని ప్రాచీన మరుగుదొడ్లు.. వ్యాక్ అనాల్సిందే..
Roman Latrines : ప్రాచీన రోమ్ మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన నాగరికతలలో ఒకటి. దాదాపు 1,000-సంవత్సరాల క్రితం.. అక్కడి మనుఘలు… నేటికీ ప్రజలు ఆశ్చర్యపడే కట్టడాలు నిర్మించారు, మోడ్రన్ మనిషికే తెలియని సాంకేతికతను వాడారు. అలాంటి రోమ్ లో ప్రాచీన మరుగు దొడ్లు చూస్తే.. మనం వ్యాక్ అనాల్సిందే.. రోమ్ లో అప్పటి ప్రజలు సామూహికంగా మరుగు దొడ్లు వినియోగించే వారు. పొడవైన చెక్క బల్లలకు రంద్రాలుంటాయి.! వాటి కిందిగా నీరు ప్రవహిస్తుంది.! టాయిలెట్ కు వచ్చిన వారు వీటి మీద కూర్చునేవారు.!పని అయ్యాక కడుక్కోడానికి జిలోస్పోంగియం అనే వస్తువును వాడేవారట. జిలోస్పోంగియం అంటే.. ఓ పొడవాటి కర్ర చివరన స్పాంజ్ జత చేయబడి ఉంటుంది. దానిని నీటిలో ముంచి దానితో తమ మలాన్ని కడుక్కునేవారట. చదువుతుంటేనే ఎలానే ఉంది కదూ..
ఇక ధనవంతులు, హోదా కలిగిన కుటుంబాల వారికి కడుక్కోడానికి స్పాంజిని వెనిగర్ లేదా ఉప్పు నీటిలో ముంచి ఇచ్చేవారట. ఇంకా డబ్బున్న కుటుంబాలు…తాము మలవిసర్జనకు వెళ్లే మునుపే తమ సేవకులను పంపి… టాయిలెట్ సీటు ను వేడి చేయించేవారట.పురాతన రోమ్లోని దాదాపు ప్రతి నగరంలో పెద్ద బహిరంగ మరుగుదొడ్లు ఉన్నాయి. చాలా మంది వ్యక్తులకు సరిపోయేలా ఇవి నిర్మించేవారు. ఎక్కువగా 20మంది పట్టే మరుగుదొడ్లు ఉండేవి. ఉదాహరణకు, జూలియస్ సీజర్ యొక్క ఫోరమ్లో, పురావస్తు శాస్త్రవేత్తలు 50 మరుగుదొడ్లతో కూడిన మరుగుదొడ్డిని కనుగొన్నారు. పురాతన రోమ్లోని ఇతర మరుగుదొడ్ల మాదిరిగానే, సీజర్స్ లో కూడా వేడిచేసిన అంతస్తు ఉంది.

ancient roman latrines opulent gross historian explores
సాధారణంగా చాలా మరుగుదొడ్లలో పాలరాతి పలకలు, అంతస్తులపై మొజాయిక్లు, అలంకార విగ్రహాలు ఉన్నాయి.ప్రమాదాలూ ఎన్నో..ఈ సామూహిక మరుగుదొడ్లలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగేవట.! ఒక్కో సారి ఎలుకలు టాయిలెట్ మీద కూర్చున్న వ్యక్తుల వృషణాలను కొరికేవట.! మలం కారణంగా ఉత్పత్తి అయ్యే మీథేన్ గ్యాస్ వల్ల అప్పుడప్పుడు విస్పోటనాలు కూడా జరిగేవట.! ఇక స్పాంజి కారణంగా బ్యాక్టీరియా, వైరస్ లు ఒకరి నుండి ఒకరికి చేరేవట..దీంతో అంతుపట్టని రోగాలు వచ్చేవట! ఈ కాలంలోని ప్రజలు తమ టాయిలెట్ తంతు సురక్షితంగా అవ్వాలని…వారి దేవత అయిన ఫార్చునాను ప్రార్థించేవారట!