BJP : ఏపీలో బీజేపీ సొంత సర్వే చేస్తే.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయి?
ప్రస్తుతం బీజేపీ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చి దేశాన్ని పాలిస్తోంది పార్టీ. తెలంగాణలోనూ దూకుడు మీదనే ఉన్నది. ఏపీలో కూడా ఎలాగైనా బలపడాలని ప్రయత్నిస్తోంది. ఏపీలో కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ఉంది పార్టీ. బీజేపీ నాయకులు కూడా ఆదిశగానే ప్రయత్నిస్తున్నారు.
2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందడుగు వేస్తున్నారు బీజేపీ నేతలు. కానీ.. ఏపీలో అసలు బీజేపీ గెలిచే చాన్స్ ఉందా? జనసేనతో జతకట్టినా కూడా పార్టీని ఏపీ ప్రజలు గెలిపిస్తారా? అనేది పెద్ద డౌట్. ఏపీలో పార్టీ బలపడాలనే పార్టీ పగ్గాలను కూడా సోము వీర్రాజుకు ఇచ్చారు. కొందరు వైసీపీ నేతలు కూడా బీజేపీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యంలో అసలు ఏపీలో పార్టీ బలపడుతుందా? అంటే మాత్రం ఖచ్చితంగా అవును అని చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.
కీలక విషయాల్లో ముందడుగు వేయలేకపోతున్న బీజేపీ
అయితే.. ఏపీలో కీలక విషయాల్లో మాత్రం ఎందుకో బీజేపీ నేతలు జంకుతున్నారు. ఉదాహరణకు విగ్రహాల ధ్వంసం అంశంపై కూడా మాట్లాడలేకపోతున్నారు. దీంతో ప్రజల్లో బీజేపీ తమ విశ్వాసాన్ని కోల్పోతోంది. రాజధాని విషయంలో కానీ… ప్రత్యేక హోదా విషయంలో కానీ.. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అంశంపై కానీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అది బీజేపీకి పెద్ద గుదిబండగా మారుతోంది.
త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ సొంతంగా సర్వే చేయించిందట. సర్వేలో తేలిన విషయాలు చూసి బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారట. ప్రస్తుతం ఏపీ ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారట. బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ మునిగిపోతోంది. దానికి నిదర్శనం జనసేననే. మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.