చంద్రబాబు మళ్ళీ జన్మలో నోరెత్తకుండా – ప్రూఫ్స్ బయటపెట్టిన వైఎస్ జగన్
ప్రతిపక్షాలు అంటేనే అధికార పార్టీని విమర్శిస్తాయి. వాటి పనే అది కదా. ఏపీలో కూడా అదే జరుగుతోంది. రోజూ ఏదో ఒక దేవుడి గుడిపై ఏపీలో దాడి జరుగుతోంది. దీన్ని ఎవరు చేయిస్తున్నారు.. అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దాన్ని మెల్లగా ప్రభుత్వంపై నెట్టి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది ప్రతిపక్షాల ప్లాన్. కానీ.. సీఎం జగన్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.
ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పుడు కావాలని ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇది.. అంటూ సీఎం జగన్ ఆరోపించారు.
హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్. అసలు.. ఏపీలో ఏ ఆలయాల్లో దాడులు జరుగుతున్నాయో తెలుసా? జన సంచారం ఏమాత్రం లేని చోట.. టీడీపీ నేతల ఆధ్వర్యంలో.. వాళ్ల పర్యవేక్షణలో ఉన్న గుళ్లలోనే దాడులు జరుగుతున్నాయి. అంటే.. దీని వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు.. అని సీఎం జగన్ అన్నారు.
ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇవ్వనంత సెక్యూరిటీని ఏపీలోని ఆలయాలకు ఇస్తున్నాం. ఇప్పటికే 20 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు బిగించాం.
ప్రతిపక్ష పార్టీలు కావాలని.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గుర్తుంచుకోకూడదని.. చేస్తున్న కుట్రలు ఇవి. ఏదైనా మంచి పథకం ప్రారంభిస్తే చాలు.. వెంటనే ఏదో ఒక ఆలయాన్ని ధ్వంసం చేస్తారు.. ప్రజల దృష్టిని అంతా అటువైపు మార్చుతారు.. ఇలాంటి కుయుక్తులు ఇక ఏపీ ప్రజల ముందు చెల్లవు.. పోలీసులపై కూడా ఈ ఘటనల వల్ల బ్యాడ్ నేమ్ వస్తోంది.. దేవాదాయ శాఖ పరిధిలో లేని గుళ్ల మీదనే కావాలని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు.. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఇలాంటి దుష్టశక్తుల ఆటలు ఇంకా ఎక్కువ రోజులు సాగవు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు.