YS Jagan : ఢిల్లీకి ఏపీ సిఎం జగన్…? కారణం అదేనా…?
YS Jagan : ఏపీ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం చివరిలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం.
ఐఏఎస్ లను డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడానికి కేంద్రం సిద్దం కావడం పట్ల సిఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన రాష్ట్రాలు ఇబ్బంది పడతాయని సిఎం జగన్ ఇప్పటికే లేఖ కూడా రాసారు. సమర్ధులైన అధికారులను కేంద్రం తీసుకోవడం కరెక్ట్ కాదని అభ్యంతరం వ్యక్తం చేసారు.

ap cm jagan to delhi is there a reason
ఈ నేపధ్యంలో ఈ అంశం గురించి చర్చించేందుకు అలాగే జిల్లాల ఏర్పాటు గురించి కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు ఆయన వెళ్తున్నారు. జనాభా గణన పూర్తయ్యే వరకు జిల్లాల ఏర్పాటు వద్దని కేంద్రం చెప్పడంతో జగన్ కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారానికి ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ పట్టుదలగా ఉంది.