YS Jagan : తన ఖాతాలో మరో అవార్డును వేసుకున్న సీఎం జగన్?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి కారణం ఏపీలో ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు, ఏపీ ప్రజల కోసం ఆయన చేస్తున్న పనులు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడంలో సీఎం జగన్ సఫలమయ్యారు. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ap cm ys jagan bags cm of the year award
ఇప్పటికే బెస్ట్ సీఎం అంటూ చాలా అవార్డులు సీఎం జగన్ ను వరించాయి. తాజాగా మరో అవార్డును సీఎం జగన్ తన ఖాతాలో వేసుకున్నారు. అదే స్కోచ్ సంస్థ వారు అందించిన సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు.
ఏపీలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలే ఆయన్ను అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిపాయని స్కోచ్ సంస్థ వెల్లడించింది.
స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్.. ఈ సందర్భంగా సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపి.. సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేశారు.
YS Jagan : అత్యుత్తమ పాలనను అందించిన రాష్ట్రంగా నిలిచిన ఏపీ
ఈ సంవత్సరం అత్యుత్తమ పాలనను అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. అలాగే ప్రజల కోసం మంచి పాలనను అందించి.. రాష్ట్రాన్ని జగన్ అగ్రస్థానంలో నిలిపారని.. స్కోచ్ చైర్మన్ అభినందించారు.
ఇటీవలే ఏబీపీ న్యూస్.. దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన సర్వేలో సీఎం జగన్.. బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని పొందారు. ఏబీపీ న్యూస్ సర్వేలో ఒడిశా సీఎం నవీన్ మొదటి స్థానం, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ ఉన్నారు.
ఇలా వరుసగా బెస్ట్ సీఎం అవార్డులు వస్తుండటంతో… ఏపీ ప్రజలతో పాటు.. వైసీపీ నేతలు, శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా.. ఎంతో అనుభవం ఉన్న నేతలా రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపిస్తున్నారని.. వైసీపీ నేతలు జగన్ ను కొనియాడుతున్నారు.