YS Jagan : అన్ని కష్టాల మధ్యలో ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ !
YS Jagan : ఏపీలో ప్రభుత్వం ప్రారంభించే పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులదే. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చిందే ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థకు దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. వీళ్లను తీసుకొని రెండేళ్లు అయింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో
సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. సచివాలయంలో ప్రస్తుతం కార్యదర్శులకు ఎంత జీతాలు ఉన్నయో.. వీళ్లకు కూడా అదే రేంజ్ లో పే స్కేళ్లు ఉంటాయన్నమాట. సచివాలయ ఉద్యోగుల పేస్కేల్ ను ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు అమలు చేస్తారు. రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకొని శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన వారికే ఈ ప్రొబెషన్ వర్తిస్తుంది.
YS Jagan : మే 1 నుంచి కొత్త పే స్కేల్ వర్తింపు
సచివాలయం ఉద్యోగులకు కొత్త పే స్కేల్.. మే 1 నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం 19 కేటగిరీలకు చెందిన కార్యదర్శులు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో రూ.23120 ప్రారంభ వేతనం కాగా.. రూ.74770 గరిష్ఠ వేతనంగా ఖరారు చేసింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డు అడ్మిషన్ సెక్రటరీకి గరిష్ఠ పే స్కేల్స్ లభించాయి. అంటే.. ఈ రెండు కేటగిరీలకు సమాన పే స్కేల్స్ లభించనున్నాయి. వీళ్ల పే స్కేల్ ను మే 1 నుంచి అమలు చేసేలా కలెక్టర్లతో పాటు సచివాలయం శాఖ, పంచాయతీ రాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.