ys jagan : జగన్ రెండు నిర్ణయాలపై మంత్రి వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న రెండు నిర్ణయాలను సొంత పార్టీ నాయకులు మరియు స్వయంగా మంత్రి వర్గంలోని మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వారు సున్నితంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకు ఆ రెండు విషయాలు ఏంటంటే.. మొదటిది విశాఖ స్టీల్ ప్లాంట్ లో తయారు అవుతున్న ఆక్సీజన్ ను యూపీ మరియు మహారాష్ట్రకు తరలించేందుకు కేంద్రంకు ఓకే చెప్పడం ఇక రెండవది అమూల్ కోసం రాష్ట్రంలోని 50 శాతం మిల్క్ ఉత్పత్తుల సంఘాలను రద్దు చేయడం. ఈ రెండు నిర్ణయాలు కూడా మంత్రి వర్గంలో ఏకాభిప్రాయంను తీసుకు రాలేదు. జగన్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల విపక్షాలు రెచ్చి పోయే అవకాశం ఉందని మంత్రులు అంటున్నారు.
ys jagan : ఆక్సీజన్ కొరత..
ఏపీలో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సీజన్ అవసరం చాలా ఉంది. ఇప్పటికే ఏపీకి కావాల్సిన ఆక్సీజన్ ను తమిళనాడు నుండి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అలాంటిది ఏపీలో ఉత్పత్తి అయ్యే ఆక్సీజన్ ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుందని ఈ సందర్బంగా మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆక్సీజన్ కొరత వచ్చిన సమయంలో విపక్ష పార్టీల వారు విమర్శలకు దిగుతారని అందుకే ఆక్సీజన్ ను కేంద్రం చెప్పినట్లుగా ఇతర రాష్ట్రాలకు ఇవ్వద్దని మంత్రులు అంటున్నారు.
ys jagan : అమూల్ విస్తరణ సరికాదు..
ఏపీలో అమూల్ విస్తరణ కోసం 50 శాతం వరకు డైరీలను మూసి వేయాలనే ప్రతిపాధనను ప్రభుత్వం తీసుకు వస్తే ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీతో పాటు అన్ని పార్టీల వారు మరియు అన్ని డైరీ సంఘాలు కూడా ఆందోళనలు చేస్తాయి. తద్వారా ప్రభుత్వంపై మచ్చ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఆరోపణలు రాకుండా ఉండాలంటే 50 శాతం డైరీలను మూసి వేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ మంత్రులు సున్నితంగా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరి మాట వినే రకం కాదు. అలాంటిది మంత్రులు అడ్డు చెప్తే ఆ నిర్ణయాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనక్కు తీసుకుంటాడా అంటే అనుమానమే అంటున్నారు.