TDP : టీడీపీ ఇమేజ్ ను పెంచుతున్న వైఎస్ జగన్.. టీడీపీ ట్రాప్ లో పడిపోయారా?
TDP : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు.. అదేనండి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నేతల మీద కేసులు పెట్టారు.. లోపలేయించారు.. మా పార్టీ అధికారంలోకి రాకపోదా? అప్పుడు మీ సంగతి చెబుతాం.. ఆగు అని అప్పుడే వైసీపీ నేతలు టీడీపీ నేతలను హెచ్చరించారు కూడా. అనుకున్నట్టే 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త దూకుడుగానే ఉంది. ఆ విషయం ప్రస్తుతం కాలంలో అర్థం అవుతూనే ఉన్నది. అయితే.. కావాలని.. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ అంటూ టీడీపీ నేతలు సీఎం జగన్ ను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కావాలని.. అధికార పార్టీ ఏం చెబితే అది చేస్తూ.. టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
అయితే.. కావాలని ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తుంటే.. ఆ నేతలకు మాత్రం ఇమేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఎందుకంటే.. వాళ్లను అరెస్ట్ అయితే చేస్తున్నారు కానీ.. వాళ్లు నిజంగా చేసిన తప్పేంటి? వాళ్ల అక్రమాలు ఏంటి? అవినీతి ఏంటి.. అనేదానిపై అధికార పార్టీకి స్పష్టత లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన టీడీపీ నేతలకు సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలను, ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంతో.. అరెస్ట్ అయిన టీడీపీ నేతలకు ప్రజల్లో విపరీతంగా ఇమేజ్ పెరుగుతోందట.
TDP : కావాలని సైలెంట్ అవుతున్న టీడీపీ నేతలు
అరెస్ట్ అయిన టీడీపీ నేతలు కూడా కావాలని సైలెంట్ అవుతుండటం.. అసలు వైసీపీ నేతలపై ఎటువంటి విమర్శలు చేయకుండా ఉంటుండటంతో… టీడీపీ నేతలు ఏం తప్పు చేయలేదు.. అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడటంతో పాటు.. కావాలనే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్.. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా.. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల మీద కాస్త దూకుడుతనం తగ్గించాలని.. లేదంటే.. కావాలని టీడీపీ నేతలపై సీఎం జగన్ కేసులు నమోదు చేసి తన పగను తీర్చుకుంటున్నారని జనం భావించాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో సైలెంట్ అవుతుండటంతో.. టీడీపీ నేతల ట్రాప్ లో సీఎం జగన్ పడిపోయి… తన ఇమేజ్ ను తానే డౌన్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ విషయంలో మాత్రం సీఎం జగన్ కూడా ఓసారి ఆలోచించాల్సిందే.