Ys Jagan : జగన్ కోసం కోటి మంది తరలిరాబోతున్నారు, ప్రతిపక్షాలకి చలిజ్వరం
ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో రాజకీయాలు మతం రంగు పులుముకున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. మతం ముసుగులో రాజకీయాలు చేయాలనుకోదు. మతంతో పెట్టుకుంటే ఎంత డేంజరో అందరికీ తెలుసు. కానీ.. ఏపీలో మాత్రం రాజకీయాలు మతాల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చాక.. మత రాజకీయాలు ఎక్కువయ్యాయి.
మత రాజకీయాలను అడ్డం పెట్టుకొని.. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోయడమే పని.
ఇంకో విషయం ఏంటంటే.. సీఎం జగన్ ఒక క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ కాబట్టే.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. హిందూ మతాన్ని దెబ్బ తీయడం కోసమే ఇటువంటి పనులను వైసీపీ చేయిస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు టీడీపీ, బీజేపీ పార్టీలే కావాలని మతం రంగు పూసుకొని సీఎం జగన్ పై బురద జల్లుతున్నాయని.. దేవాలయాలపై జరుగుతున్న దాడులు టీడీపీ, బీజేపీల పనే అంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
మత రాజకీయాలను ఆపేయాలి?
మత రాజకీయాలను ప్రతిపక్ష పార్టీలు ఆపేయాలని.. మత రాజకీయాలకు నిరసనగా… వైసీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుందంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కడైనా లేదంటే అమరావతిలో వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మత రాజకీయాలు చేసే ప్రతిపక్షపార్టీలకు చెంపపెట్టులా ఉండాలని భావిస్తున్నారు.
ఈ బహిరంగ సభకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని…. కనీసం కోటి మందిని ఈ బహిరంగ సభకు ఆహ్వానిస్తున్నారని.. మత రాజకీయాలు చేసే పార్టీలకు వణుకు పుట్టేలా.. ఏపీ చరిత్రలోనే ఈ సభ అందరికీ గుర్తుండిపోయే విధంగా వైసీపీ ప్లాన్ చేస్తోందట. చూద్దాం మరి.. ఇందులో నిజం ఎంతో? అబద్ధం ఎంతో?