AP Free Bus Scheme | ఏసీ బస్సుల్లోను ఫ్రీగా ప్రయాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే స్త్రీ శక్తి పథకాన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తాజాగా ప్రకటించడంతో అందరు అవాక్కయ్యారు.

#image_title
తాడిపత్రిలో ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ.. త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో సిటీ, పల్లెటూర్లకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ పల్లె వెలుగు సర్వీసుల్లో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు. 1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానుండగా, ఇందులో 300 బస్సులు తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయిస్తామన్నారు. స్త్రీ శక్తి పథకంతో రోజూ లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు
తాడిపత్రి బస్టాండ్‌పై కప్పుకు పెచ్చులు ఊడటాన్ని గమనించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని తిరుమలరావు ఆదేశించారు. పనులు త్వరలో ప్రారంభించి.. బస్టాండ్‌లో ఈ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో రూ.1.30 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో మొదలవుతాయని తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండు ప్రాంగణాన్ని పూర్తిగా సిమెంటు రోడ్డుతో బాగు చేస్తామని.. దీనికి రూ.1.30 కోట్లు ఖర్చు అవుతుందని.. ఈ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు.పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, మన రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు ఎంతో ఓర్పు, సహనంతో ఉన్నారని, ఇది చాలా అభినందనీయం అన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.