Ap Legislative Council : ఆ ఇద్దరు మాజీ మంత్రుల బకరాలను చేసిన సీఎం జగన్..?
Ap Legislative Council : గత సంవత్సరం ఏపీలో రెండు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడం.. సీఆర్డీఏ రద్దు చేయడం.. ఈ రెండు బిల్లులతో పాటు.. శాసనమండలి రద్దు.. ఇవే గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. శాసనసభలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. ఏపీ శాసనమండలిలో మాత్రం వీగిపోయింది.దీంతో ఆగ్రహం చెందిన సీఎం జగన్.. శాసనమండలినే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఒక బిల్లు.. శాసనమండలిలో వీగిపోతే.. ఏకంగా మండలినే రద్దు చేస్తారా? అని ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెట్టాయి.
అయినా కూడా సీఎం జగన్ వినలేదు. శాసనమండలిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు.దీంతో శాసనమండలిలో సభ్యులుగా ఉన్నవాళ్లంతా తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. వాళ్లలో మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కూడా ఉన్నారు. నిజానికి.. 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. దీంతో వాళ్లను ఎమ్మెల్సీలుగా చేసి.. మంత్రి పదవులు ఇచ్చారు జగన్.వాళ్లకు మంత్రి పదవి దక్కిన సంవత్సరానికే శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో.. వాళ్ల ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా పోయింది.
Ap Legislative Council : ప్రస్తుతం శాసనమండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న జగన్ ప్రభుత్వం
దీంతో వాళ్లను రాజ్యసభకు పంపించినప్పటికీ.. మంత్రి పదవి పోయిందనే బాధలో మాత్రం వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం శాసనమండలి రద్దు బిల్లును కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఉన్న మంత్రి పదవి పాయె.. ఎమ్మెల్సీ పాయె.. అని ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు తలపట్టుకొని కూర్చున్నారట. ఇద్దరిని మాత్రం జగన్ భలేగా బకరాలను చేశాడు అని ఏపీ రాజకీయ సర్కిల్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.