YS Jagan : లోకల్.. నేషనల్.. ఇంటర్నేషనల్ పెళ్లాలు.. పవన్ పై జగన్ సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : లోకల్.. నేషనల్.. ఇంటర్నేషనల్ పెళ్లాలు.. పవన్ పై జగన్ సెటైర్లు

 Authored By kranthi | The Telugu News | Updated on :13 October 2023,5:00 pm

YS Jagan : ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును కావాలని అరెస్ట్ చేయించారని టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వైఎస్ జగన్ కావాలని చంద్రబాబును అరెస్ట్ చేయించారని, ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగం అని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ పైనే విమర్శలు చేశారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై, పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ స్పందించారు. సామర్లకోటలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయనకు దోచుకోవడానికే సమయం సరిపోలేదని.. కేవలం దోచుకోవడానికే సమయం వెచ్చించారని అన్నారు. చంద్రబాబు సొంతిల్లు కూడా పొరుగు రాష్ట్రం అయిన హైదరాబాద్ లో ఉందని జగన్ విమర్శించారు.

చంద్రబాబు ఎప్పుడైనా జనాల్లో ఒక నెల రోజులు వరుసగా కనిపించారా? ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నారు. ఆయన్ను కాదని.. ఆయన్ను సమర్థించే వారు కానీ.. వాళ్లకు ఏపీపై ప్రేమ ఉందా? వీళ్లెవరూ ఏపీలో ఉండరు కానీ.. ఏపీ రాజకీయాలు వీళ్లకు కావాలి. గజదొంగలు, ముఠాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్లందరికీ ఏపీ రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలంటే.. ఇక్కడి డబ్బును దోచుకోవడం కోసమే. చంద్రబాబు దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా హైదరాబాద్ లోనే కానీ.. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలు , నాలుగు సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒక్కోసారి లోకల్, మరొక్కసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్.. మరి ఈసారి ఎక్కడికి వెళ్తారో అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.

ap cm ys jagan satires on pawan kalyan

#image_title

YS Jagan : తన అభిమానుల ఓట్లను హోల్ సేల్ లో అమ్ముకునేందుకే పవన్ పార్టీ పెట్టారు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం చేతకాని వాళ్లు నాయకులుగా జనం ముందుకు వస్తున్నారు. సరుకులు, సరంజామా అమ్ముకునే వాళ్లను చూశాం కానీ.. సొంత పార్టీని అమ్ముకునే వాళ్లను మాత్రం మనం ఇప్పుడే చూస్తున్నాం. రెండు షూటింగులు చేసుకొని అప్పుడో ఇప్పుడో వచ్చిపోతారు. ఇటువంటి వాళ్లకు మన రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసుకోవాలి. ఇదంతా ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వీళ్లందరికీ జనం బాధలు పట్టవు. ప్యాకేజీ స్టార్ కు తను ఓడిపోయిన గాజువాక, భీమవరంతోనూ సంబంధం లేదు. తన అభిమానుల ఓట్లను హోల్ సేల్ లో అమ్ముకునేందకే పవన్ పార్టీ పెట్టారు.. అంటూ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది