YS Jagan : ఈనాడు, ఆంధ్రజ్యోతి అస్సలు చదవకండి.. వాటిని అస్సలు నమ్మకండి.. మీకు నేనున్నా.. జగనన్న కామెడీ మామూలుగా లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఈనాడు, ఆంధ్రజ్యోతి అస్సలు చదవకండి.. వాటిని అస్సలు నమ్మకండి.. మీకు నేనున్నా.. జగనన్న కామెడీ మామూలుగా లేదు

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 అస్సలు చూడకండి

  •  వాళ్లవన్నీ అబద్ధాలే

  •  జరగాల్సిన సాయం మీద దృష్టి సారిద్దాం

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోనే ఏ రాష్ట్రంలో తీసుకురానటువంటి సంక్షేమ పథకాలను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఏపీలో ప్రస్తుతం చాలా సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. జగనన్న నవ రత్నాలు కావచ్చు.. మరో పథకం కావచ్చు.. చాలా పథకాలను పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసమే సీఎం జగన్ తీసుకొచ్చారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రజలతో కాసేపు ఫన్ గా మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను అస్సలే చదవొద్దని సూచించారు. దయచేసి అపోహలు నమ్మొద్దు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడకండి. ఎందుకంటే.. వీళ్లంతా అబద్ధం చెబుతా ఉంటారు. కేవలం వీళ్లంతా మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేరు కాబట్టి.. ఈ మనిషిని తప్పించి ఆ మనిషిని కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్లు తప్పుడు రాతలు రాస్తారు. వాళ్లను అస్సలు నమ్మొద్దు. ప్రభుత్వం మీకు అన్న రకాలుగా తోడుగా ఉంటుంది అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మీ బిడ్డ ప్రభుత్వానికి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి మధ్య ఉన్న ఇంకో తేడా కూడా చెబుతా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ కీడు జరగలేదు. ఎవ్వరికీ నష్టం జరగలేదు. వాలంటీర్, సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం. కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజ్ చేశాం. ఇంతకుముందు ఉన్న ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి ఇంతకు ముందు లేని సచివాలయం వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పనిని చెడగొట్టి అధికారులను నా చుట్టు తిప్పుకొని ఫోటోలకు పోజులివ్వను. ఇప్పటికి, ఇంతకుముందుకు తేడా ఇదే. ఇప్పుడు మీ బిడ్డ.. ఏదైనా ఘటన జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడు. మీకు వారం రోజులు సమయం ఇస్తాను. వారం తర్వాత నేనే వచ్చి మీరు ఎలా పనిచేశారు అని ప్రజలను అడుగుతా. నేను అడిగినప్పుడు ప్రజలు బాగా కలెక్టర్ పని చేశాడు అని వాళ్ల నోటి నుంచి రావాలి అని కలెక్టర్ కు చెప్పాను. కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సరైన సమయం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని చూడటానికి మీ బిడ్డ మళ్లీ వస్తాడు అని కూడా జగన్ చెప్పుకొచ్చారు.

YS Jagan : జరిగిన నష్టం అపారమైంది

జరిగిన నష్టం అపారమైంది కాదని నేను అనను కానీ.. జరగాల్సిన సాయం మీద దృష్టి సారిద్దాం. గత ప్రభుత్వాల కన్నా చాలా మిన్నగా, ఎక్కువగా కూడా జరుగుతుంది అని మాత్రం నేను మాటిస్తున్నాను. రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు ఇవన్నీ డ్యామేజీ అయితే వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేయాల్సినవి చేయిస్తాం. పర్మినెంట్ గా కూడా టేకప్ చేయాల్సిన పనులను వీలైనంత త్వరగా చేస్తాం అని జగన్ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది