YS jagan : ఏపీ మహిళలకు జగన్ శుభవార్త… వారి ఖాతాల్లో నిధుల జమా…!
ప్రధానాంశాలు:
YS jagan : ఏపీ మహిళలకు జగన్ శుభవార్త... వారి ఖాతాల్లో నిధుల జమా...!
YS jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వై నాట్ 175 నినాదంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో భాగంగానే సంక్షేమం సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే వరుస సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి…తాజాగా మరో పథకం నిధులను మహిళల ఖాతాలలో వేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. దీనిలో భాగంగానే జనవరి 1న పెన్షన్లకు 4 వేల పెంపు అమలను ప్రారంభించారు. ఇక దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 67 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరింది. ఇక ఈ నెలలో 23వ తేదీన వైయస్సార్ ఆసరా పథకం ద్వారా నిధులను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు రూ.25,570 కోట్లను ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే చివరి విడతగా 6400 కోట్లు అందించనున్నారు. అలాగే ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు సమాచారం. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారు.
అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన వైయస్సార్ చేయూత పథకం నిధులను విడుదల చేసేందుకు సీఎం జగన్ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 206 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశముంది. అయితే ఫిబ్రవరి 5 నుండి 14 వరకు వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుందని ఇక ఈ పథకం కింద ఇప్పటివరకుు రూ.14,129 కోట్లు అందించినట్లు తెలియజేశారు. అయితే ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మైనారిటీ వర్గాలలో అట్టడుగు వర్గాల వారికి తోడుగా నిలిచేందుకు అమలు చేస్తున్నట్లు
తెలుస్తోంది. అదేవిధంగా 45 ఏళ్లు పైచిలుకు ఉన్న మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.18, 750 అందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ పథకంలో యూనిట్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నట్లు సమాచారం.
అయితే ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నెల 31వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశంలో సీఎం జగన్ ఎన్నికల వరాలను ఖరారు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే ఉద్యోగులు మహిళలు , రైతులు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారాలు సాగుతున్నాయి. అంతేకాక ఫిబ్రవరి 6 నుండి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. అయితే ఎన్నికల వేల సీఎం జగన్ మంత్రివర్గ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలలో కొత్త వరాలపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భీమిలిలో ప్రారంభించిన సిద్ధం సభలను ఫిబ్రవరి 3 ఏలూరులో ఆ తర్వాత అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్ సంక్షేమ పథకంలో భాగంగా చేయూత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.