Ramoji Rao – YS Jagan : ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టిన వైఎస్ జగన్.. రామోజీరావు చాప్టర్ క్లోజ్?
Ramoji Rao – YS Jagan : చాలా రోజుల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీపై దాడులు జరుగుతున్నాయి. ఆ కంపెనీ ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుది. అయితే.. ఈ కంపెనీ రామోజీ రావుది కాదని.. మార్గదర్శి కంపెనీ యాజమాన్యం వేరే అంటూ రామోజీ రావు మార్గదర్శి స్కామ్ నుంచి బయట పడాలని కూడా చూశారు. అయినా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ స్కామ్ పై దృష్టి సారించింది. అందుకే.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలపై దాడులు చేశారు.
అందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసులపై కూడా దాడులు నిర్వహించారు. ఏపీలోని వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో 8 మార్గదర్శి ఆఫీసులపై అధికారులు దాడులు చేశారట. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదే ఉందట. దాని మీద దాడి చేయడం కోసమే. కావాలని అన్ని చిట్ ఫండ్స్ కంపెనీల మీద దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రామోజీ రావు తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పలు కథనాలు వండి వార్చుతున్నారు. జగన్ మార్గదర్శి మీద దృష్టి పెడితే.. రామోజీ మాత్రం.. జగన్ మీద దృష్టి పెట్టారు. నిజానికి.. మార్గదర్శి కేసు ఇప్పటిది కాదు..
Ramoji Rao – YS Jagan : జగన్ కు వ్యతిరేకంగా రామోజీ రావు ప్రత్యేక కథనాలు వండివార్చుతున్నారు
చాలా ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరిస్తోందంటూ కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. చాలా ఏళ్ల నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుపై సీరియస్ గా ఉంది. ఒకవేళ రామోజీ రావు చేసిన ఆర్థిక నేరం కనుక కోర్టులో రుజువు అయితే.. దాదాపుగా రూ.6 వేల కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అని ఉండవల్లి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రామోజీ రావు తదుపరి స్టెప్ ఏంటో.. ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.