AP Grama Volunteer : వాలంటీర్ వ్యవస్థ పై పక్క రాష్ట్రాల ఆసక్తి.. గ్రామ సచ్చివాలయ వ్యవస్థ వండర్
AP Grama Volunteer : దేశంలో ఎక్కడ లేని విధంగా అద్బుతమైన వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకు రావడం పట్ల కేంద్ర మంత్రుల నుండి పలు రాష్ట్రాల ముఖ్య మంత్రుల వరకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్.. ఆ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పనులన్నీ పథకాలన్నీ జనాలకు అందించే పాలన తీరు అనేది చాలా బాగుందంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి వారికి ప్రభుత్వ పథకాలు చాలా సునాయాసంగా అందడం మాత్రమే కాకుండా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఉందంటూ ఈ వ్యవస్థను అధ్యయనం చేసిన పలువురు విశ్లేషకులు మరియు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర భారతం నుండి మొదలుకుని దక్షిణ భారంలోని ఒకటి రెండు రాష్ట్రాలు కూడా ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. తమ రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి వ్యవస్థను తీసుకు రాకూడదు అంటూ చాలా మంది ముఖ్యమంత్రులు భావిస్తున్నారట. గ్రామ సచ్చివాలయం మరియు వాలంటీర్ ల వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా సగం అభివృద్ది మరియు సంక్షేమం జరిగినట్లే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థలను తీసుకు వస్తే మంచిదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమ పథకాలను వారి వద్దకు చేర్చేందుకు ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని భావించగా.. ఆయన నుండి వచ్చిన ఆలోచనే గ్రామ సచ్చివాలయం మరియు వాలంటీర్ వ్యవస్థ. కొన్ని ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాని వాటిని అమలు చేయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటారు. కాని జగన్ మాత్రం కనీసం ఏడాది కూడా తిరగకుండానే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలనను పరుగులు తీయిస్తున్నాడు. అందుకే పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి.