YS Viveka Murder Case : వివేకా హత్య కేసుపై హోం మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Viveka Murder Case : వివేకా హత్య కేసుపై హోం మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 April 2021,8:30 pm

YS Viveka Murder Case : రెండేళ్ల క్రితం… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో…. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. వివేకాను తన ఇంట్లోనే దుండగులు హతమార్చారు. వివేకా హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. సీబీఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ… హంతకులకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు. దీంతో వివేక హత్య కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే.. తన తండ్రి కేసును కావాలని ఆలస్యం చేస్తున్నారని… దర్యాప్తు కూడా సరిగ్గా లేదని వివేకా కూతురు సునీతా రెడ్డి విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తను రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కూడా కలిశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. దీంతో మళ్లీ వివేకా హత్య కేసు పైలును సీబీఐ అధికారులతో పాటు… ఏపీ ప్రభుత్వం కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది.

ap home minister sucharitha responds on YS Viveka murder case

ap home minister sucharitha responds on YS Viveka murder case

తాజాగా వివేకా హత్య కేసుపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఏపీ హోంమంత్రి సుచరిత వివేకా హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే అసలు నిందితులు ఎవరో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కావాలని… వివేకానంద రెడ్డి హత్య కేసును అందరూ భూతద్దంలో చూస్తున్నారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. వివేకా హత్య కేసు త్వరలోనే సాల్వ్ అవుతుంది… అని సుచరిత వెల్లడించారు.

YS Viveka Murder Case : చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందనడం అవాస్తవం

చంద్రబాబుపై జరిగిన దాడి గురించి మాట్లాడిన సుచరిత…. అసలు తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడే జరగలేదన్నారు. అదంతా అవాస్తవం అని ఆమె స్పష్టం చేశారు. కావాలని సానుభూతి కోసం దాడి జరిగినట్టుగా క్రియేట్ చేశారు. అసలు.. చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? వైసీపీ అంత దిగజారుడు పనులు అస్సలు చేయబోదు… అంటూ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది