Chandrababu : చంద్రబాబుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన హోం మినిస్టర్ !
Chandrababu : ఏమన్నా అంటే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు చంద్రబాబు. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఏం తెలియని వ్యక్తిలా బిహేవ్ చేస్తారా? గన్నవరం ఘటన చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే.. గన్నవరం విషయంలో తప్పు ముమ్మాటికీ టీడీపీదే అని స్పష్టం అవుతోంది. గన్నవరం వెళ్లి మరీ.. టీడీపీ నేతలు రచ్చ చేయడం.. వాళ్లను చంద్రబాబు సపోర్ట్ చేయడం చూస్తుంటే టీడీపీకి ఇక రోజులు చెల్లిపోయాయని అనిపిస్తోంది. అధికార పార్టీని కావాలని రెచ్చగొట్టి.. […]
Chandrababu : ఏమన్నా అంటే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు చంద్రబాబు. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఏం తెలియని వ్యక్తిలా బిహేవ్ చేస్తారా? గన్నవరం ఘటన చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే.. గన్నవరం విషయంలో తప్పు ముమ్మాటికీ టీడీపీదే అని స్పష్టం అవుతోంది. గన్నవరం వెళ్లి మరీ.. టీడీపీ నేతలు రచ్చ చేయడం.. వాళ్లను చంద్రబాబు సపోర్ట్ చేయడం చూస్తుంటే టీడీపీకి ఇక రోజులు చెల్లిపోయాయని అనిపిస్తోంది. అధికార పార్టీని కావాలని రెచ్చగొట్టి..
వాళ్లతో గొడవకు దిగడం దేనికి సంకేతం. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కావాలని గన్నవరం వెళ్లి ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు ముఖ్యమంత్రిని కూడా బండబూతులు తిట్టడంపై వైసీపీ నాయకులు కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేయడంతో పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. పట్టాబితో పాటు మరో 16 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా టీడీపీ నేతల దాడిలో గాయపడిన సీఐ కనకారావును రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు.
Chandrababu : టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ సీఐని పరామర్శించిన హోం మంత్రి
పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో పాల్గొంటుంటే.. వాళ్లపై టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను ఏమనాలి. అసలు టీడీపీ అధినేత చంద్రబాబే బెదిరింపులకు పాల్పడటం దేనికి సంకేతం. మీకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందన్నారు. ఇదేనా మీ అనుభవం. పోలీసులను గౌరవించాలే విషయం తెలియదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇదేనా మీకు తెలిసిన గౌరవం. ప్రభుత్వంపై బురద జల్లడం కాదు.. ముందు మీరు చేసే తప్పుల గురించి ఆలోచించండి.. అంటూ హోం మంత్రి తానేటి వనిత.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.