AP Police : పోలీసులకి ఏపీ సర్కార్ బిగ్ గుడ్ న్యూస్ !
AP Police : ఏపీ పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది తర్వాత ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సు బకాయిలను తాజాగా ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వ బకాయిలు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. జీతాలు టైమ్ టు టైమ్ పోలీసులకు అందుతున్నా.. అలవెన్సులు రాలేదు. అరేర్స్ బకాయిలు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై తాజాగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
అరెర్స్ బకాయిలను చెల్లించడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 11 నెలల నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయాలంటూ పోలీస్ డిపార్ట్ మెంట్ చాలారోజుల నుంచి ఈ బకాయిల కోసం ఎదురు చూస్తోంది. ట్రావెలింగ్ అలవెన్సులతో పాటు హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక.. సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. పోలీస్ శాఖ సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువు అయింది.
AP Police : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట
పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు జిల్లాలు కలిపి దాదాపుగా రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. టీఏ అలవెన్స్ బకాయిలే రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ఇతర బకాయిలు అన్నీ కలిపి మరో రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ అలవెన్సులను విడుదల చేసి పోలీస్ శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి ఏపీ ప్రభుత్వం నిరూపించుకుంది.