YS Jagan : ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్… ఆ దిశగా సీఎం జగన్ ఆదేశాలు
YS Jagan : పర్యావరణ సంరక్షణపై ఏపీ సర్కారు దృష్టి సారిస్తోంది. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ల దిశగా అడుగులేస్తోంది. దీంతో యువతకు ఉపాధి లభిస్తుందనే అలోచనలో ఉంది. చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా విలువైన వస్తువలను తయారు చేసేలా ప్లాన్ చేస్తోంది. బీచ్ లు పరిశుభ్రంగా మార్చి మరింత శోభ తేనున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుకపోవడంతో నీటి కాలుష్యం, ఆహార పంటలు కాలుష్యానికి గురవుతున్నాయి. దీంతో పర్యావరణానికి హానీ చేస్తోంది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లక్షల టన్నులలో పేరుకుపోతోంది.
అందుకే పర్యావరణ సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని చెబుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసే ప్రయత్నాలు చేసినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామం ఈ ప్లాన్ గనక సక్సెస్ అయితే క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్చ ఆంధ్రప్రదేశ్ గా కీర్తింపబడుతుంది. అలాగే మంచి ఫలితాలు చూడవచ్చని పర్యావరణ ప్రియులు అంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. రీ సైక్లింగ్ చేస్తే కొంతైనా ముప్పు తప్పుతుందిని అంటున్నారు. అలాగే ప్రజల్లో కూడా ప్లాస్టిక్ వాడకంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
అయితే ఏపీలో ఇప్పటికే స్వచ్చ సంకల్పం కార్యక్రమంతో చెత్త సేకరణ జరుగుతోంది. ఈ చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా రోడ్ల నిర్మాణానికి, సిమెంట్ తయారీలోనూ వేస్టేజ్ ని వాడుకునే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే సీఎం జగన్ గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్‌బుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నంలో చేపట్టాలని నిర్ణయించారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానం చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆదేశించారు కూడా. అయితే చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.