PM Svanidhi Yojana : ప్రధానమంత్రి అందిస్తున్న 50 వేల రుణం కోసం… ఇలా దరఖాస్తు చేసుకోండి…
PM Svanidhi Yojana : కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధానమంత్రి స్వనిధి యోజన ను అమలు చేస్తుంది. ఈ పథకం కింద పదివేల వరకు రుణాలు చాలా ఈజీగా కొన్ని నిబంధనలపై అందిస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రుణం పొందడం మరింత సులభమైంది. ఇప్పుడు వీధి వ్యాపారులు దేశవ్యాప్తంగా ఉన్న 3.8 లక్షలు సాధారణ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. ఈ పథకం ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ పథకం ద్వారా లక్షలాదిమంది లబ్ధి పొందుతున్నారు. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ప్రజలకు నిధులు అందుతున్నాయి. ప్రధానమంత్రి స్వనిది యోజన పథకాన్ని వీధి వ్యాపారుల స్వయం విశ్వాస నిధి పథకం అని కూడా పిలుస్తారు.
ఈ పథకంలో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి నిధులు అందుతున్నాయి. ఈ పథకం కింద వీధి వ్యాపారం పదివేల వరకు రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అదే రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవ సారి 20 వేల రూపాయల వరకు మూడోసారి 50వేల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకం కింద రుణ గ్రహీతలు డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ప్రోత్సహించబడతారు. అందుకు బహుమానం పొందుతారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు కొత్త అవకాశాలు తెరవబడతాయి. రుణం కోసం ఇలా నమోదు చేసుకోవాలి.
వీధి వ్యాపారుల కామన్ సర్వీస్ సెంటర్ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దీనిలో నమోదు చేసుకున్నవారు రుణం పొందే అవకాశాన్ని పొందుతారు. ఈ రుణం ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది మరియు దానిని నెలవారి వాయిదాలలో చెల్లించాలి. ఇలా చేయడం ద్వారా మీరు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందుతారు. ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. అక్కడ అప్లై లోన్ ఆప్షన్ పై క్లిక్ చేసి నా తర్వాత కొత్త పేజీ తెరవబడుతుంది. అందులో మీరు ఫోన్ నెంబర్లు నమోదు చేసి క్యాప్చ్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఓటిపి వస్తుంది. దానిని నమోదు చేయాలి. అప్పుడు నాలుగు ప్రతిపాదికను అర్హత అడుగుతారు. అందులో ఏదైనా ఒకదానిపై క్లిక్ చేయాలి. దీని తర్వాత దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం ద్వారా అన్ని వివరాలను నింపి సబ్మిట్ చేయాలి.