Breaking : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్మీ..!!
Breaking: దేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరిగిపోతోంది. కరోనా కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఉన్న ఉద్యోగాలు కోల్పోయేలా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలలో ఖాళీల భర్తీల కోరుతూ 400 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
రెండేళ్ల ప్రొఫెషనల్ పిరియడ్ కింద అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. వయసు పరిమితి 18 నుంచి 27 లోపు ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 12/11/2022. అర్హతలు వచ్చేసరికి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్ లో డిప్లమో చేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. జీతం వచ్చేసరికి : ₹29,200/- నుండి ₹92,300 వరకు.
ఏఏ రాష్ట్రాలలో ఖాళీల వివరాలు : అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్: 10
ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా: 120
జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్: 23
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు: 32
రాజస్థాన్, గుజరాత్: 23
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్: 185
పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, సిక్కిం: 26
కేటగిరీల వారీగా ఖాళీలు : ఎస్సీ: 62
ఎస్టీ: 31
ఎక్స్ సర్వీస్ మేన్: 41
మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్:20
పీడబ్ల్యూబీడీ: 16
యుఆర్: 171
ఈడబ్ల్యూఎస్: 42
ఓబీసీ: 113