కోడిగుడ్లు కొనాలంటేనే భయపడిపోతున్న నెల్లూరు వాసులు… ఎందుకో తెలుసా…?
నెల్లూరు: కల్తీకేది కాదు అనర్హం అన్నట్లు ఇప్పటివరకు కల్తీ అంటె మనకు గుర్తొచ్చేది చైనా. అక్కడ ఏదైనా కల్తీ చేస్తారని మనందరికీ తెలుసు. అక్కడ అన్నిరకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తారు. వాళ్లని ఆదర్శంగా తీసుకున్న నెల్లూరికి చెందిన కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్నారు. కరోనా కారణంగా కోడిగుడ్లకు యమ డిమాండ్ పెరగడంతో మోసగాళ్లు ఈ ఆకృత్యానికి తెర లేపి వాటిని మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇక అసులు విషయానికొస్తే…
నెల్లూరు జిల్లా వరికుంట పాడు సమీపంలోని ఆండ్ర వారి పల్లెలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడిగుడ్లు అమ్మే ఒ వాహనం గ్రామంలోకి వచ్చింది. ఒరిజినల్ గా 30 కోడిగుడ్లు 180 రూపాయలు కానీ 130 రూపాయలకే వస్తుండటంతో ప్రజలు ప్రజలు విరివిగా కొనుగోలు చేశారు . ఓ మహిళ ఇంటికి వచ్చి వాటిని ఉడకబెట్టగా ఎంతకీ ఉడక పోవడంతో ఇరుగుపోరుగు వారికి సమాచారం తెలిపింది. వారందరూ వాటిని పరీక్షించి అది కృత్రిమ కోడిగుడ్డుగా నిర్థారించుకున్నారు. కోడిగుడ్డు పెంకులో ప్లాస్టిక్ అవశేషాలు, రబ్బర్ లాంటి ఆనవాళ్లు కనిపించాయి. కోడిగుడ్డు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉడకబెట్టినా ఉడకడం లేదు. లబ్బర్‌లా సాగుతోంది. నేలకు కొడితే బందిలాగా ఎగురుతుంది. ఇలాంటి కృత్రిమ కోడిగుడ్లు అంటకట్టినందుకు గ్రామస్థులు గుడ్ల వ్యాపారిపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇదే జిల్లాలో కృత్రిమ కోడిగుడ్లు బయటపడ్డాయి. మరోసారి కృత్రిమ కోడిగుడ్లు బయటికి రావడంతో ఈ కృత్రిమ గుడ్ల వ్యవహారం చర్చనియాంశంగా మారిది.
గుర్తించడం ఎలా?
ఈ గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే కొంచెం తక్కువ సోజులో ఉంటుంది. గుడ్డును పగులగొట్టి చూస్తే తెల్లసొన తక్కువగానూ, పచ్చసొన ఎక్కువగా ఉంటుంది. పరీక్షించి వాసన చూస్తే దుర్వాసన కూడా వస్తుంది.