Aisa Cup 2025 | ఆసియా కప్ 2025 జట్టుపై తీవ్ర విమర్శలు.. ఇదేం జట్టు అని తిట్టిపోస్తున్న మాజీలు
Aisa Cup 2025 | సెప్టెంబర్ 9న ప్రారంభంకానున్న ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ప్రకటించిన భారత టీముపై అప్పుడే వివాదాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ మరియు శ్రేయాస్ అయ్యర్ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#image_title
చోటు దక్కని స్టార్ ఆటగాళ్లు
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రకటించిన జట్టులో జైస్వాల్, శ్రేయాస్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. జితేష్ శర్మను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేయగా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు చోటు సంపాదించారు.
భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఈ ఎంపికపై తీవ్రంగా స్పందించాడు. జైస్వాల్, శ్రేయాస్ లాంటి ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కకపోవడం దురదృష్టకరం. వారిద్దరూ ఇటీవల అద్భుత ఫారమ్‌లో ఉన్నా.. ఒకరిని కూడా ఎంపిక చేయకపోవడం నిజంగా అన్యాయమే. జట్టు ఎంపిక అనేది థ్యాంక్స్ లెస్ జాబ్ అయిపోయింది,” అని అన్నారు అశ్విన్.ఈ జట్టులో శుభ్‌మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అయితే, జైస్వాల్‌ను వదిలేసి గిల్‌కు అవకాశం ఇవ్వడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. గిల్ టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే కాక, టీ20లలోనూ తన స్థిరతను చూపలేదని విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో “#JusticeForJaiswal” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.