Surya Kumar Yadav : ఇదేం రాజకీయం అంటూ గంభీర్, సూర్య కుమార్‌లపై దారుణమైన ట్రోలింగ్.. ఇంతకీ వారు ఏం చేశారంటే..!
ప్రధానాంశాలు:
Surya Kumar Yadav : ఇదేం రాజకీయం అంటూ గంభీర్, సూర్య కుమార్‌లపై దారుణమైన ట్రోలింగ్.. ఇంతకీ వారు ఏం చేశారంటే..!
Surya Kumar Yadav : జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకి వెళ్లింది. టీమిండియా నయా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌తోనే గంభీర్ కూడా హెడ్ కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలు పెటట్ఆడు. అయితే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మంచి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Surya Kumar Yadav ఎందుకింత కక్ష…
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) బ్యాట్ ఝుళిపించారు. ఇక 214 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ బ్యాట్ ఝుళిపించిన తర్వాత ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచకపోవడంతో ఓటమి పాలయ్యారు.
అయితే ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. జింబాబ్వే పర్యటనలో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించిన అతన్ని కాదని పరాగ్‌ని తీసుకోవడమేంటి అని ట్రోల్ చేశారు. సంజూని జట్టులోకి తీసుకోవడమే చాలా తక్కువ అంటే.. తీసుకున్నప్పుడు కూడా బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పూర్తిగా బెంచ్‌కు పరిమితమైన సంజూ శాంసన్ ని ఇప్పుడు శ్రీలంక సిరీస్‌లో కూడా బెంచ్‌కి పరిమితం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. అయితే రియాన్ పరాగ్‌ను తీసుకొని సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడానికి కారణం ఎక్స్‌ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అని అందరు భావించారు. అన్నట్టుగానే రియన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసాడు.