Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ టాలెంట్ గుర్తించిన బీసీసీఐ.. అతడికి ప్రమోషన్ ఫిక్సా..!
ప్రధానాంశాలు:
Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ టాలెంట్ గుర్తించిన బీసీసీఐ.. అతడికి ప్రమోషన్ ఫిక్సా..!
Shreyas Iyer : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముంగిట టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ప్రమోషన్ దక్కేలా కనిపిస్తుంది.గతేడాది శ్రేయాస్ అయ్యర్ క్రమశిక్షణ సమస్యల కారణంగా కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. కానీ ఈసారి, అతను తన అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి కాంట్రాక్టు పొందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ టాలెంట్ గుర్తించిన బీసీసీఐ.. అతడికి ప్రమోషన్ ఫిక్సా..!
Shreyas Iyer శ్రేయాస్ కి గుడ్ న్యూస్..
దేశీయ క్రికెట్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా రాణించడం అతని తరఫున బలంగా నిలుస్తోంది. బీసీసీఐ వర్గాల ప్రకారం, “రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలా? వద్దా? అనే అంశంపై బోర్డు వేచి చూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను మంచి నాయకత్వం వహించడంతో పాటు, గతంలో భారత్‌కు T20 ప్రపంచ కప్ కూడా అందించాడు. అయినప్పటికీ, బీసీసీఐనిర్ణయం టోర్నమెంట్ తర్వాతే వెల్లడవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో నిలకడగా ఆడిన అతను.. తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కనబర్చాడు. 4 మ్యాచ్‌ల్లో 48.75 సగటుతో 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో 40 ప్లస్ రన్స్ చేయడం విశేషం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టింది. ఈ క్రమంలోనే అతనికి రివార్డ్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తుంది.