Feet | రాత్రి నిద్రకు ముందు నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేస్తే ఎలాంటి మంచి ఫలితాలు ఉన్నాయో తెలుసా?
Feet | చాలామందికి రాత్రి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసే అలవాటు ఉంటుంది. కొందరు కొబ్బరి నూనెతో చేస్తే, మరికొందరు నెయ్యితో చేస్తారు. వాస్తవానికి నెయ్యితో చేసే పాదాల మసాజ్ వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పురాతన అలవాటును మరచిపోయారు. అయితే ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. మరి నెయ్యి పాదాలకు రాయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
#image_title
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
నెయ్యిలో ఉండే విటమిన్లు A, D, E మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి శరీరం నుంచి హానికరమైన విషాలను బయటకు పంపడమే కాకుండా, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి.
పగిలిన మడమలకు ఉపశమనం
ఎక్కువ సేపు నేలపై నడవడం, వాతావరణ ప్రభావం వల్ల పాదాల చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. ఇలాంటి సమయంలో నెయ్యి రాయడం వల్ల తేమను అందించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.పాదాలను ముందుగా గోరువెచ్చని నీటితో కడిగి, ఆరబెట్టి నెయ్యితో మసాజ్ చేస్తే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి.
రక్తప్రసరణ మెరుగుపడుతుంది
అరికాళ్లలో ఉండే రిఫ్లెక్సాలజీ పాయింట్లు శరీరంలోని వివిధ అవయవాలకు అనుసంధానమై ఉంటాయి. నెయ్యితో మసాజ్ చేసినప్పుడు ఈ పాయింట్లు ప్రేరేపించబడతాయి. ఫలితంగా రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు చేరుతాయి.
నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి
నిద్ర సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట పాదాలకు నెయ్యి రాసి మసాజ్ చేస్తే మంచి నిద్ర పొందుతారు. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి శరీర శక్తిని సమతుల్యంగా చేస్తుంది. ఫలితంగా లోతైన, ఆందోళనలేని నిద్ర లభిస్తుంది.
శరీరం నుంచి విషపదార్థాల తొలగింపు
కాలుష్యం వల్ల శరీరంలో పేరుకునే హానికర పదార్థాలను బయటకు పంపడంలో కూడా నెయ్యి మసాజ్ సహాయపడుతుంది. ఇది డీటాక్స్‌లా పనిచేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.