Vinayaka | వినాయక చవితి నాడు గణపతికి ప్రియమైన ఆకు కూర ఏంటంటే..!
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె నుంచి పట్టణం వరకు పండుగ మాదిరిగానే సందడి నెలకొంటుంది.ఈ వేళ గణపతికి ఇష్టమైన వంటకాలు చేస్తూ, భక్తి పూర్వకంగా నైవేద్యం సమర్పిస్తారు.

#image_title
తుమ్మికూర (ద్రోణపుష్పి) ప్రాముఖ్యత
వినాయక చవితి వర్షాకాలం చివర్లో, శరదృతువు ప్రారంభంలో వస్తుంది. ఈ కాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు ఋషుల సూచన మేరకు తుమ్మికూరను ఆహారంగా తీసుకునే ఆచారం ప్రవేశపెట్టారు.
గణేశుడికి తుమ్మికూర సమర్పించడం కేవలం పూజా విధానమే కాదు. ఇది భక్తి, ఆరోగ్యం, ప్రకృతితో ఏకత్వానికి చిహ్నం. పూజ అనంతరం ఆ ఆకును ఆహారంగా తీసుకోవడం ద్వారా, మన ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాక, పూజా నైవేద్యాన్ని పవిత్రంగా స్వీకరించే ఆచారాన్ని పాటించినవారమవుతాం. తుమ్మికూర రోగనిరోధక శక్తి పెంపు, వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి కలిగిస్తుంది.జలుబు, దగ్గు, జ్వరాల నివారణకు ఉపయోగపడుతుంది.జీర్ణక్రియ మెరుగుదల,అజీర్ణం, కడుపు వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.