Vinayaka Chaturthi : వినాయకుని మీ ఇంట్లో ప్రతిష్టిస్తున్నారా…అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి…!!
Vinayaka Chaturthi : హిందూమతంలో గణేష్ ఉత్సవానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను 11 రోజులు పాటు ఘనంగా జరుపుతారు. అనంతరం చతుర్దతి రోజున ఈ ఉత్సవాలను ముగిస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ నవరాత్రులు సెప్టెంబర్ 7వ తేదీ 2024 న ప్రారంభమై, సెప్టెంబర్ 17వ తేదీన ముగుస్తాయి. అయితే అన్ని రకాల ఆటంకాలను తొలగించేవాడు వినాయకుడు. వినాయక చవితి రోజున గణపతిని ఇంట్లో పెట్టి పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని […]
Vinayaka Chaturthi : హిందూమతంలో గణేష్ ఉత్సవానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను 11 రోజులు పాటు ఘనంగా జరుపుతారు. అనంతరం చతుర్దతి రోజున ఈ ఉత్సవాలను ముగిస్తారు. అయితే ఈ ఏడాది గణేష్ నవరాత్రులు సెప్టెంబర్ 7వ తేదీ 2024 న ప్రారంభమై, సెప్టెంబర్ 17వ తేదీన ముగుస్తాయి. అయితే అన్ని రకాల ఆటంకాలను తొలగించేవాడు వినాయకుడు. వినాయక చవితి రోజున గణపతిని ఇంట్లో పెట్టి పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం. అయినప్పటికీ వాస్తు శాస్త్రాన్ని గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చే ముందు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
రంగుల ఎంపిక.
మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టం. అయితే కొంతమంది రంగుల వినాయకుడిని పూజించాలి అనుకునేవారు తెలుపు రంగు గణపతి విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తెలుపు రంగు శాంతికి స్వేచ్ఛకు చిహ్నం. కాబట్టి ఇంటికి శ్రేయస్సు ,శాంతిని తీసుకురావాలని కోరుకుంటూ తెలుపు రంగు విగ్రహాన్ని పూజించవచ్చు. మీ ఇంట్లో తెలుపు రంగు గణపతిని ప్రతీష్టించి పూజించవచ్చు.
భంగిమను జాగ్రత్తగా చూసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గణపతి కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో కూర్చున్న వినాయకుడిని కొనడం మంచిది. ఎందుకంటే ఈ భంగిమ శాంతి విశ్రాంతిలను అందిస్తుంది. అలాగే ఇంటిని మరింత ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
గణేశుడి తొండం.
వినాయకుడిని ఇంట్లో పూజించాలి అనుకునేవారు విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు తొండం ఎడమవైపు వంగి ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వినాయకుడిని తీసుకువస్తే ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తాయి.
గణేశుడిని ప్రతిష్టించే దిశ.
వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహాన్ని ఇంటి ఉత్తర పడమర ఈశాన్య దిశలో ఉంచాలి. హిందూ మతం లో అత్యంత విశిష్టమైన దేవులలో ఒకరైన పరమశివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి వినాయకుడిని కూడా అదే దిశలో ఉంచడం మంచిది.