Viral Video : ఏపీలో వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు .. తిట్టిపోస్తున్న జనం .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఏపీలో వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు .. తిట్టిపోస్తున్న జనం ..

 Authored By aruna | The Telugu News | Updated on :20 September 2023,9:30 pm

Viral Video  : హిందువుల పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ గణేష్ చతుర్థి. ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసే ప్రతి పనిలో విజయం కలగాలని గణేశుడిని ప్రార్థిస్తాం. అయితే భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగను కొందరు తమ సరదాల కోసం జరుపుకుంటున్నారు. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా జంగం గుంట్ల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలోని వైయస్సార్ పార్టీకి చెందిన నేతలు ఇలా వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లను ఏర్పాటు చేశారు.

వేదికపై యువతులు డాన్సులతో హోరెత్తించారు. ఈ డ్యాన్సులు చూడడానికి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ఇలా వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన జనాలు పిచ్చి తిట్లు తిడుతున్నారు. వినాయక చవితికి ఎవరైనా ఇలా రికార్డింగ్ డాన్స్ లను పెట్టిస్తారా అని సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉన్నాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన వినాయక చవితి పండుగ ను ఇలా రికార్డింగ్ డ్యాన్సులతో జరుపుకుంటారా అని సీరియస్ అవుతున్నారు.

Viral Video ఏపీలో వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు తిట్టిపోస్తున్న జనం

Viral Video : ఏపీలో వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్స్ లు .. తిట్టిపోస్తున్న జనం ..

ఇంకా బాధాకరం ఏంటంటే ఈ రికార్డింగ్ డాన్స్ లను జగనన్న పార్టీకి చెందిన నేతలు పెట్టడం విశేషం.
దీంతో జనాలు వైయస్సార్సీపి పార్టీని తిడుతున్నారు. ఏపీలో రాజకీయం ఇలా దిగజారుడుగా ఉండడం ఏపీ ప్రజలను కలచి వేస్తుంది. మరోసారి జగనన్న పార్టీ ఆంధ్ర ప్రజల చేత విమర్శలను ఎదుర్కొంటున్న ఏది ఏమైనా వినాయక చవితి పండుగకి ఇలా రికార్డింగ్ డాన్సులు చేయడం ఏమాత్రం సరికాదు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారింది. ఏపీలో రాజకీయం ఇలా ఉంది అంటూ కొందరు డైరెక్ట్గా కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది