Ganesh Chaturthi : వినాయక చవితి తర్వాత నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!
ప్రధానాంశాలు:
Ganesh Chaturthi : వినాయక చవితి తర్వాత నుండి ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!
Ganesh Chaturthi : వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. అయితే హిందూ శాస్త్రంలో వినాయకుడిని మూలపురుషుడిగా చెప్పుకుంటారు. అలాగే ఈ వినాయక చవితికి జ్యోతిష్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో వినాయక చవితి సందర్భంగా కొన్ని రాశుల వారికి విఘ్నేశ్వరుడి కటాక్షం లభించబోతుంది. మరి ఆ రాశులు ఏమిటి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Ganesh Chaturthi కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి వినాయక చవితి పండగ సందర్భంగా విగ్నేశ్వరుడి కటాక్షం లభిస్తుంది. దీంతో వీరి వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లను పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి వినాయకుడి కటాక్షంతో సకల శుభాలు జరుగుతాయి.
Ganesh Chaturthi కన్యా రాశి.
వినాయక చవితి నుండి కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. అలాగే వీరు శుభవార్తలను వింటారు. ఈ సమయంలో వీరు అప్పుల బాధల నుండి బయట పడతారు. మరియు నూతన ఆదాయ మార్గాల దిశగా అడుగులు వేస్తారు. ఇక కెరియర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. కన్య రాశి వారు వినాయక చవితి నుండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
తులారాశి.
తులారాశి వారు వినాయక చవితి నుండి కొన్ని శుభవార్తలను వింటారు. వీరికి అకాస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరి ఆస్తులు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . తులా రాశి జాతకులు సంతానం ద్వారా శుభవార్తలను వింటారు. వినాయక చవితి నుండి ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.
మీన రాశి.
వినాయక చవితి పండగ సందర్భంగా మీన రాశి వారికి విగ్నేశ్వరుడి కటాక్షం పుష్కలంగా లభిస్తుంది. వీరు ఈ సందర్భంలో ఏ పనులను తలపెట్టిన ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతాయి. మీనరాశి ఉద్యోగులు మరియుు వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. సంతానంలో శుభవార్తలు వింటారు. మరి ముఖ్యంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.