Krishnapatnam Anandayya : ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!
Krishnapatnam Anandayya : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు.. కృష్ణపట్నం ఆనందయ్య. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా కాలంలో ప్రజలను కాపాడటానికి వచ్చిన దేవుడు ఆయన అంటూ అందరూ ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు ఆయన మందు కనిపెట్టి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కరోనాకు ఆయన ఆయుర్వేద మందును తయారు చేయడమే కాకుండా.. దాన్ని ఉచితంగా కొన్ని లక్షల మందికి పంచి పెట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందును తీసుకున్న తర్వాత చాలామందికి కరోనా తగ్గింది. పాజిటివ్ ఉన్నవాళ్లకు ఒకటి రెండు రోజుల్లోనే నెగెటివ్ వచ్చింది. ఆక్సిజన్ లేవల్స్ పడిపోయిన వాళ్లకు కంటి మందు వేయగానే.. ఆక్సిజన్ లేవల్స్ ఒక్కసారిగా పెరిగాయి.

Ayush department report on krishnapatnam anandayya ayurvedic medicine
ఆ మందును వేసుకున్న వాళ్లందరు కూడా తమకు కరోనా నయం అయిందని పాజిటివ్ గా చెబుతుండటంతో.. ఈ విషయం అంతటా తెలిసి.. అక్కడికి జనాలు పోటెత్తారు. విపరీతంగా జనాలు రావడంతో కృష్ణపట్నం జనాలతో కిక్కిరిసిపోయింది. అయితే.. ఈ విషయం ప్రభుత్వానికి తెలియడం, ఆ తర్వాత అసలు.. నిజంగా ఇది ఆయుర్వేద మందేనా.. అని టెస్ట్ చేయడం కోసం.. ఆయుష్ అధికారులు కృష్ణపట్నాన్ని సందర్శించారు. ఆనందయ్య తయారు చేసిన మందును పరిశీలించారు. దాన్ని ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేసి దాని మీద రిపోర్టు ఇచ్చారు.
Krishnapatnam Anandayya : అది ఆయుర్వేద మందు కాదు.. నాటు మందు
ఆనందయ్య ఆయుర్వేద మందుపై రిపోర్ట్ వెల్లడించిన ఆయుష్ అధికారులు.. ఆనందయ్య ఇచ్చే మందు ఆయుర్వేద మందు కాదని.. అది నాటు మందు అని తేల్చి చెప్పారు. ఆయుర్వేదానికి సంబంధించిన ఎటువంటి ప్రోటోకాల్స్ ఇందులో పాటించలేదని ఆయుష్ అధికారులు స్పష్టం చేశారు. కాకపోతే.. ఆనందయ్య కరోనా మందు కోసం వాడే వన మూలికలు అన్నీ ఆరోగ్యానికి మంచివేనని.. అందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని వాళ్లు స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్ కూడా హానికరం కాదన్నారు. కాకపోతే.. దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేమని.. దాన్ని కేవలం నాటువైద్యంగానే పరిగణించాల్సి ఉంటుందని వాళ్లు వెల్లడించారు.
ప్రస్తుతానికి ఆనందయ్య కరోనా మందు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. వేల సంఖ్యలో జనాలు అక్కడికి రావడం, కరోనా సోకిన వాళ్లు కూడా అక్కడి వచ్చి కరోనా మందు కోసం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా అజాగ్రత్తగా ఉంటుండటంతో.. ప్రస్తుతానికి కరోనా మందు పంపిణీని నిలిపివేశారు. అలాగే.. ఆ మందుకు సంబంధించిన రిపోర్ట్ ను ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కు ప్రభుత్వం పంపించింది. వాళ్లు ఏ రిపోర్ట్ ఇస్తారో తెలిశాక.. అప్పుడు ఆ మందుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.