రైతులు అధైర్యపడకండి.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది : ఎంపీ బడుగుల లింగయ్య
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీని వల్ల ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటం వల్ల.. రైతులు తాము పండించిన పంటను అమ్మడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Badugula Lingaiah Yadav Press Meet at penpahad
రైతులు అధైర్యపడకండి : బడుగుల లింగయ్య
మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం కళ్లాల మీదనే తడిచి ముద్దవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో రైతులకు భరోసానిచ్చి.. వాళ్లను అధైర్యపడొద్దంటూ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా విపత్తు దృష్ట్యా.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని ఎంపీ బడుగుల హామీ ఇచ్చారు.
ఆయన ఇవాళ పెన్ పహాడ్ మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల ఎంపీపీ నెమ్మాది బిక్షంతో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. రైతులకు భరోసా కల్పించారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వడంతో మండలానికి చెందిన రైతులందరూ ఊపిరిపీల్చుకున్నారు.